News November 24, 2024
TODAY HEADLINES
✒ మహారాష్ట్రలో NDA, ఝార్ఖండ్‌లో ‘INDIA’ విజయం
✒ వయనాడ్: 4,10,931 ఓట్ల తేడాతో ప్రియాంక గెలుపు
✒ MHలో అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయి: మోదీ
✒ 26న మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ప్రమాణం?
✒ ‘మహా’ ఫలితాల్ని ఊహించలేదు: రాహుల్
✒ పవన్ ప్రచారం చేసిన 10 స్థానాల్లో బీజేపీ గెలుపు
✒ ఏపీలో 2029లోనే ఎన్నికలు: సీఎం చంద్రబాబు
✒ కొడంగల్ ప్రజలను ఇబ్బంది పెట్టను: CM రేవంత్
✒ INC 11నెలల పాలనలో 42మంది మృతి: కవిత
Similar News
News November 24, 2024
Great: సుకుమార్ ఇంట్లో హెల్పర్.. నేడు ప్రభుత్వోద్యోగి!
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో హెల్పర్‌గా ఉన్న దివ్య అనే అమ్మాయి చదువుకుని ప్రభుత్వోద్యోగం సంపాదించారు. సుకుమార్ భార్య తబిత ఈ విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘దివ్య చదువుకుని నేడు ప్రభుత్వోద్యోగిగా కొలువు సాధించింది. మా కళ్లముందే రెక్కలు విప్పి పైపైకి ఎగురుతున్న దివ్యను చూస్తే చాలా గర్వంగా, తృప్తిగా ఉంది. తన కొత్త జర్నీకి మా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. సుకుమార్ కుటుంబమే ఆమెను చదివించడం విశేషం.
News November 24, 2024
208 ఓట్ల తేడాతో గెలిచిన మహా కాంగ్రెస్ చీఫ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం మూట కట్టుకోగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నానా పటోలే కొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కారు. సకోలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అవినాష్ బ్రహ్మంకర్‌పై 208 ఓట్ల తేడాతో గెలుపొందారు. పటోలేకు 96,795 ఓట్లు రాగా, బ్రహ్మంకర్‌కు 96,587 ఓట్లు వచ్చాయి. ఓవరాల్‌గా అత్యల్ప మెజారిటీ MIM అభ్యర్థి ముఫ్తీ మహ్మద్ ఖలీక్(162 ఓట్లు)ది కావడం గమనార్హం.
News November 24, 2024
తెలుగు టైటాన్స్‌కు ఐదో పరాజయం
ప్రో కబడ్డీ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 31-28 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. TTలో విజయ్ 15 పాయింట్లు, గుజరాత్లో ప్రతీక్ 11 పాయింట్లు సాధించారు. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన తెలుగు టైటాన్స్ 8 విజయాలతో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో హరియాణా స్టీలర్స్ కొనసాగుతోంది.