News December 5, 2024

TODAY HEADLINES

image

* తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు
* మహిళలను ఆర్థికంగా బలపరుస్తాం: CM CBN
* కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత: జగన్
* కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు: CM రేవంత్
* KCRపై కోపంతో CM తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తున్నారు: KTR
* మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ఖరారు
* PSLV-C59 ప్రయోగం రేపటికి వాయిదా
* వరల్డ్ వైడ్‌గా ‘పుష్ప-2’ ప్రీమియర్స్ ప్రారంభం

Similar News

News December 5, 2024

ఈ నెలలోనే క్యాబినెట్ విస్తరణ?

image

TG: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఈ నెలలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి AICC కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో TPCC ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి మంత్రివర్గ సభ్యుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. క్యాబినెట్‌లో 6 ఖాళీలు ఉండగా తీవ్ర పోటీ నెలకొంది. చాలా మంది MLAలు ఆశలు పెట్టుకున్నారు. టీపీసీసీ నూతన కార్యవర్గం కూడా ఏర్పాటవుతుందని తెలుస్తోంది.

News December 5, 2024

నేడు టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

image

AP: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ ఎన్నికల్లో 16,737 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

News December 5, 2024

మంచు దుప్పటిలా మారిన లార్డ్స్ స్టేడియం

image

క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ మైదానం మంచుతో నిండిపోయింది. మైదానం మొత్తం మంచు దుప్పటి పరచినట్లుగా మారింది. దీంతో స్టేడియం అందాలు రెట్టింపు అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా క్రిస్మస్‌కు ముందు ఇంగ్లండ్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో మంచు కూడా అధికంగా పడుతుంటుంది.