News April 7, 2024

TODAY HEADLINES

image

✒ 2047 కోసం 24/7 పనిచేస్తా: మోదీ
✒ అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్: రాహుల్
✒ TG: KCRకు చెర్లపల్లి జైలులో ఇల్లు కట్టిస్తా: రేవంత్
✒ TG: కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం కోల్పోయింది: హరీశ్
✒ AP: జగన్ పాలన ఓ పీడ కల: చంద్రబాబు
✒ AP: పేదల కోసం ఒక్క పథకమైనా తెచ్చావా బాబూ?: జగన్
✒ AP: పెన్షన్ల పంపిణీ గడువు 2 రోజులు పొడిగింపు
✒ RRvsRCB: కోహ్లీ సెంచరీ వృథా.. బెంగళూరు ఓటమి

Similar News

News October 30, 2025

ఇంట్లో పూజ గది ఏవైపున ఉండాలి?

image

ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉండటం ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. అది కుదరకపోతే.. తూర్పు/పడమర వైపు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ‘ప్రతి ఇంట్లో పూజా మందిరం తప్పనిసరిగా ఉండాలి. ఇది మనల్ని నియంత్రిస్తూ, భక్తిని, నమ్మకాన్ని పెంచుతుంది. అయితే.. ఆ గదిలో స్వర్గస్తుల ఫొటోలు ఉండకూడదు. నవగ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు కూడా శుభం కాదు. కులదేవతా ఫొటోలు మాత్రం ఉండవచ్చు’ అన్నారు. <<-se>>#Vasthu<<>>

News October 30, 2025

ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం: తుమ్మల

image

TG: తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు. ఎకరాకు రూ.10వేల చొప్పున అందజేస్తామన్నారు. ఖమ్మంలో వరద ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. 4.5లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. పశుసంపద, ఇళ్లు నష్టపోయిన వారినీ ఆదుకుంటామని చెప్పారు. రేపటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారన్నారు.

News October 30, 2025

మెనుస్ట్రువల్ లీవ్‌కు ఫొటో అడగడంపై ఆందోళనలు

image

మహిళలు బయటకు చెప్పలేని అంశాల్లో రుతుస్రావం ఒకటి. విధులకూ వెళ్లలేని స్థితి. ఈ కారణంతో సెలవు అడిగిన సిబ్బందిని మెనుస్ట్రువల్ ఫొటోలు పంపాలని MD వర్సిటీ(హరియాణా) అధికారులు అడగడం వివాదంగా మారింది. గవర్నర్ వర్సిటీని సందర్శించినప్పుడు ఇది చోటుచేసుకుంది. చివరకు తాము వాడిన ప్యాడ్స్ ఫొటోలు పంపినా సెలవు ఇవ్వలేదని సిబ్బంది వాపోయారు. దీనిపై ఆందోళనలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ గుప్తా తెలిపారు.