News December 8, 2024
TODAY HEADLINES

☛ TG: ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
☛ సంక్రాంతి తర్వాత రైతుభరోసా: సీఎం రేవంత్
☛ తెలంగాణలో(MBNR) మరోసారి భూ ప్రకంపనలు
☛ AP: పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న CM CBN, పవన్ కళ్యాణ్
☛ ఏటా DSC నిర్వహిస్తాం: CM చంద్రబాబు
☛ పవన్‌పై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: విజయసాయిరెడ్డి
☛ 3 రోజుల్లోనే పుష్ప-2కి రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్
☛ అడిలైడ్ టెస్ట్: రెండో ఇన్నింగ్స్‌లో IND 128/5
Similar News
News December 27, 2025
పుట్టిన రోజులకూ జంతు బలి.. ఏంటీ సంస్కృతి?

ఏపీలో ‘జంతు బలి’పై అధికార, విపక్షాల మధ్య <<18686511>>మాటల<<>> యుద్ధం కొనసాగుతోంది. మీవారే చేశారంటే.. మీవాళ్లూ చేశారంటూ TDP-YCP విమర్శలు చేసుకుంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో జంతుబలిపై నిషేధం ఉంది. అయినా పండగలు, జాతరల సందర్భంగా బలిస్తూనే ఉన్నారు. కానీ వ్యక్తుల పుట్టినరోజులకూ వాటిని బలివ్వడం ఆందోళనకు గురి చేస్తోందని జంతు ప్రేమికులు అంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. మీరేమంటారు?
News December 27, 2025
విపత్తులతో ₹10.77 లక్షల కోట్ల నష్టం

2025లో ప్రకృతి విపత్తులతో ప్రపంచం వణికింది. హీట్‌వేవ్స్, కార్చిచ్చు, వరదల వల్ల సుమారు ₹10.77 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఒక రిపోర్ట్ వెల్లడించింది. శిలాజ ఇంధనాల వాడకం, క్లైమేట్ చేంజ్ వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని హెచ్చరించింది. USలోని కాలిఫోర్నియా ఫైర్స్ వల్ల ఏకంగా ₹5.38 లక్షల కోట్ల నష్టం వచ్చింది. ఆసియాలో తుపాన్లు, వరదలతో వేలమంది చనిపోయారు.
News December 27, 2025
మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్

TG: జనవరి 5 నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం బచావో కార్యక్రమం చేపట్టాలని CWC సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. పలు ప్రయోజనాలతో తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు Xలో రాసుకొచ్చారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఈ పథకాన్ని కాపాడుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.


