News January 1, 2025
TODAY HEADLINES

☛ తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 31st, న్యూ ఇయర్ సందడి
☛ ఫార్ములా ఈ-రేసు కేసు: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
☛ సంక్రాంతికి 6432 ప్రత్యేక బస్సులు: TGSRTC
☛ ఏపీలో మద్యం రిటైల్ షాపులకు మార్జిన్ 14%కి పెంపు
☛ 2025లో మరిన్ని కొత్త పథకాలు: సీఎం చంద్రబాబు
☛ ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి సంధ్యారాణి
☛ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు యథాతథం
Similar News
News December 9, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. భారీ వాహనాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్డివిజన్లలో నేషనల్ హైవేలు 40, 44పై లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, వ్యాన్లు, లగేజీ వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించారు.
News December 9, 2025
మండలానికొక జన ఔషధి కేంద్రం: సత్యకుమార్

AP: నకిలీ, నిషేధిత మందులు మార్కెట్లోకి రాకుండా నిఘా పెట్టాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ‘ఇటీవల 158 షాపుల్ని తనిఖీ చేస్తే 148కి సరైన అనుమతులు లేవు. సిబ్బంది అక్రమాలను ఉపేక్షించేది లేదు. అవసరమైన సిబ్బందిని APPSC ద్వారా కాకుండా MSRBతో నియమిస్తాం’ అని పేర్కొన్నారు. మండలానికొక జన ఔషధి కేంద్రం ఏర్పాటు యోచన ఉందన్నారు. 11 డ్రగ్ కంట్రోల్, 2 ల్యాబ్ భవనాల్ని మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.
News December 9, 2025
పిల్లల ఎదుట గొడవ పడుతున్నారా?

తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే అది పిల్లల్లో భయం, ఆందోళనకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇవి వారి మానసిక ఆరోగ్యం, చదువు, నిద్ర, సామాజిక సంబంధాలను దెబ్బతీయవచ్చు. అలాగే పెద్దలను అనుకరించే పిల్లలు అదే ప్రవర్తనను తమ జీవితంలో అలవర్చుకునే ప్రమాదముంది. తల్లిదండ్రులు విభేదాలను శాంతంగా పరిష్కరించుకోవాలి.


