News January 11, 2025

TODAY HEADLINES

image

* మేం వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
* ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా: రేవంత్
* అమరావతిలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం
* అమ్మాయిల జోలికి వస్తే తొక్కి నార తీస్తా: పవన్
* కేటీఆర్‌పై మరో కేసు నమోదు
* సంక్రాంతికి ‘జనసాధారణ్’ ప్రత్యేక రైళ్లు
* రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్
* తెలుగు యూట్యూబర్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు

Similar News

News November 25, 2025

తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి

image

AP: తేమ శాతం 17 దాటినా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. తూ.గో(D) చాగల్లు, దొమ్మేరులో మంత్రి మనోహర్‌తో కలిసి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షం వల్ల పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామని చెప్పారు.

News November 25, 2025

‘అరుణాచల్’ మహిళకు వేధింపులు.. భారత్ ఫైర్!

image

‘అరుణాచల్’ చైనాలో భాగమంటూ భారత మహిళను షాంఘై అధికారులు <<18373970>>ఇబ్బందులకు గురిచేయడంపై<<>> IND తీవ్రంగా స్పందించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల మధ్య నెలకొంటున్న సాధారణ పరిస్థితులకు ఈ అనవసరమైన చర్య అడ్డంకి అవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. ‘అరుణాచల్ INDలో భాగం. అక్కడి వారు IND వీసాతో ట్రావెల్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ రూల్స్‌ను చైనా ఉల్లంఘించింది’ అని మండిపడినట్లు సమాచారం.

News November 25, 2025

₹5వేల నోటు రానుందా? నిజమిదే

image

RBI కొత్తగా ₹5వేల నోట్లను విడుదల చేయబోతోందన్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని, ₹5,000 నోట్లకు సంబంధించి RBI ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఏదైనా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం RBI సైట్‌ను విజిట్ చేయాలని సూచించింది. కాగా 2016లో కేంద్రం ₹500, ₹1000 నోట్లను డీమానిటైజ్ చేసి, ఆ తర్వాత ₹2,000 నోట్లను తీసుకొచ్చింది. వాటిని 2023 మేలో ఉపసంహరించుకుంది.