News January 15, 2025
TODAY HEADLINES

✒ శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
✒ మహాకుంభమేళా: 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు
✒ 26 నుంచి ఉత్తరాఖండ్లో UCC అమలు
✒ ఈ ఏడాదీ 10 శాతం పెరగనున్న రీఛార్జ్ ధరలు?
✒ 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం: సీఎం CBN
✒ కూతురి డిగ్రీ ప్రదానోత్సవం.. లండన్కు YS జగన్
✒ తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
✒ గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం: CM రేవంత్
✒ నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
Similar News
News October 22, 2025
భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.3,380 తగ్గి ₹1,27,200కు చేరింది. 22 క్యారెట్ల 10g పసిడిపై రూ.3,100 పతనమై ₹1,16,600గా ఉంది. నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్(31.10g) ధర $245 తగ్గడమే ఇందుకు కారణం అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,80,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 22, 2025
టీచర్లకూ టెట్.. త్వరలో నోటిఫికేషన్!

AP: టీచర్లకూ టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు జాబ్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. నిరుద్యోగులు, టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు రెండేళ్లలో టెట్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
News October 22, 2025
ఏడడుగులు ఎందుకంటే?

మొదటి అడుగు – శారీరక బలం కోసం
రెండో అడుగు – మానసిక బలం కోసం
మూడో అడుగు – ధర్మాచరణ కోసం
నాల్గో అడుగు – కర్మ సంబంధమైన సుఖం కోసం
ఐదో అడుగు – పశు సమృద్ధి కోసం
ఆరో అడుగు – రుతువులలో తగిన ఆరోగ్యం కోసం
ఏడో అడుగు – సంసార జీవితాన్ని ‘ఒక యజ్ఞంగా’ భావించమని చెప్పే ‘స్నేహం’ కోసం
<<-se>>#Pendli<<>>