News January 19, 2025
TODAY HEADLINES

✒ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. దోషిగా సంజయ్
✒ తిరుమలలో అపచారాలు.. నివేదిక కోరిన కేంద్రం
✒ మావో కీలక నేత చొక్కారావు మృతి
✒ ఏపీకి అమిత్ షా.. చంద్రబాబు, పవన్‌తో భేటీ
✒ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచుతాం: పవన్
✒ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించండి: అమర్నాథ్
✒ ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం: భట్టి
✒ 94 శాతం మందికి ‘ఆత్మీయ భరోసా’ కట్: హరీశ్
✒ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన
Similar News
News December 16, 2025
పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

TG: కొమురం భీమ్(D) సిర్పూర్లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో వారు తలదాచుకున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోయేందుకే వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.
News December 16, 2025
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News December 16, 2025
కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.


