News February 1, 2025

TODAY HEADLINES

image

* మామూలుగా కాదు గట్టిగా కొడతా: KCR
* KCR.. ముందు నువ్వు సరిగ్గా నిలబడు: రేవంత్
* రేవంత్ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ నాశనం: హరీశ్ రావు
* ఈ ఏడాది కడపలో TDP ‘మహానాడు’
* చాలా ఘోరంగా ఓడిపోయాం.. ఒప్పుకోవాలి: అంబటి
* MLC ఎన్నికల తర్వాత DSC నోటిఫికేషన్: CBN
* భారీగా పెరిగిన బంగారం ధరలు
* 4వ T20లో భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
* రాష్ట్రపతి ప్రసంగంపై INC, BJP మధ్య పొలిటికల్ వార్

Similar News

News November 27, 2025

ఉత్తరలో విత్తితే, ఊదుకొని తినడానికి లేదు

image

ఉత్తర నక్షత్రం సాధారణంగా సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం లేదా ఆగిపోతాయి. ఆ సమయంలో విత్తితే పంట పండదు, తినడానికి ఏమీ ఉండదు. అందుకే వ్యవసాయ పనులకు సరైన సమయం ముఖ్యం. వర్షాకాలం పూర్తయ్యాక విత్తనాలు నాటితే నీరు లేక ఎలా పంట ఎండిపోతుందో.. పనులను సరైన సమయంలో, సరైన పద్ధతిలో చేయకపోతే ఫలితం ఉండదని ఈ సామెత భావం.

News November 27, 2025

SCలకు స్కాలర్‌షిప్.. కొత్త మార్గదర్శకాలివే

image

SC విద్యార్థులకు టాప్‌క్లాస్ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌పై కేంద్రం నూతన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇకపై పూర్తి ట్యూషన్ ఫీజు, ఇతర రుసుములను నేరుగా వారి అకౌంట్లోకే బదిలీ చేయనుంది. ఏడాదికి గరిష్ఠంగా ₹2Lతోపాటు హాస్టల్, బుక్స్, ల్యాప్‌టాప్‌ల కోసం తొలి ఏడాది ₹80K, ఆ తర్వాత ₹41K చొప్పున అందజేయనుంది. మార్కుల ఆధారంగా పథకాన్ని రెన్యువల్ చేస్తారు. IIT, IIM, NIT, NID, IHM వంటి సంస్థల్లో ప్రవేశం పొందిన వారు అర్హులు.

News November 27, 2025

దక్షిణామూర్తి ఎవరు?

image

దక్షిణామూర్తి సకల విద్యలకు, తత్వజ్ఞానానికి ఆది గురువు. ఆయన మౌనంగా ఉంటూనే కేవలం చిన్ముద్ర ద్వారా శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు. ఆయనను పూజిస్తే అజ్ఞానం తొలగి, బుద్ధి వికసించి, ఏకాగ్రత పెరుగుతుందని నమ్మకం. గురువు లేనివారు ఆయనను తమ సద్గురుగా భావించి పూజిస్తారు. శ్రీరాముడి గురువు అయిన వశిష్టుడు కూడా ఈయన దగ్గరే బ్రహ్మవిద్యను సంపాదించాడని పురాణాలు చెబుతున్నాయి.