News March 18, 2025

TODAY HEADLINES

image

* ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
* CM చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
* 11 మంది సెలబ్రిటీలపై కేసులు
* ఏ ప్రభుత్వమూ ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్
* అప్పుడు నావల్లే పార్టీ ఓడిపోయింది: చంద్రబాబు
* సీనియర్ నటి బిందు ఘోష్ కన్నుమూత
* వైసీపీ పాలనలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి: పవన్
* TG ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం: TTD

Similar News

News January 15, 2026

ఎయిర్‌స్పేస్ మూసేసిన ఇరాన్

image

ఇరాన్ తాత్కాలికంగా గగనతలాన్ని మూసేసింది. ముందస్తు అనుమతి లేకుండా తమ ఎయిర్‌స్పేస్‌లోకి ఏ విమానాన్ని అనుమతించబోమని ఆ దేశ రక్షణ శాఖ NOTAM జారీ చేసింది. దేశంలో అంతర్గత నిరసనలు, అమెరికాతో పెరుగుతున్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా యూరప్, ఆసియా దేశాల మధ్య విమాన సర్వీసుల్లో కొన్నింటిని దారి మళ్లిస్తుండగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

News January 15, 2026

ఎద్దు మోసినంత, గోనె పట్టినంత

image

పూర్వకాలంలో ధాన్యాన్ని లేదా వస్తువులను కొలవడానికి పెద్ద గోనె సంచులను ఉపయోగించేవారు. ఒక ఎద్దు ఎంత బరువును మోయగలదో, ఒక పెద్ద గోనె సంచిలో ఎంత పరిమాణం పడుతుందో అంత ఎక్కువగా (అంటే చాలా సమృద్ధిగా) ఒకరి దగ్గర ధనం కానీ, వస్తువులు కానీ ఉన్నాయని చెప్పడానికి ఈ సామెతను వాడతారు. ముఖ్యంగా అపారమైన ఐశ్వర్యాన్ని లేదా విపరీతమైన లాభాన్ని సూచించడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 15, 2026

భారత్‌ మద్దతు కోరుతున్న ఇరాన్!

image

ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. మరోవైపు యుద్ధం చేస్తామంటూ US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిలో భారత్‌ సాయాన్ని ఇరాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ స్వయంగా తెలిపారు. అయితే పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ ఆ దేశంలోని పరిస్థితులపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.