News March 20, 2025
TODAY HEADLINES

* బిల్గేట్స్ను APకి ఆహ్వానించిన CM చంద్రబాబు
* ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు: CM రేవంత్
* ఎకరానికి ₹25వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి: KTR
* అమరావతికి రూ.31,600 కోట్ల ఖర్చు: మంత్రి నారాయణ
* టీచర్ల బదిలీల చట్టంతో చరిత్ర సృష్టించబోతున్నాం: లోకేశ్
* బడ్జెట్లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు: హరీశ్ రావు
* తెలంగాణలో ‘ఇందిర గిరి జల వికాసం’ పథకం ప్రారంభం
* భూమిపై అడుగుపెట్టిన సునీతా విలియమ్స్
Similar News
News March 20, 2025
జనాభా కంటే ఫోన్లే ఎక్కువ

తెలంగాణ జనాభా కంటే ఫోన్ల సంఖ్యే ఎక్కువగా ఉందని బడ్జెట్ ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో 4.42 కోట్ల మొబైల్స్, 15.2 లక్షల ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో టూ వీలర్ల వాటా 73.52%. మిగతా కేటగిరీలో కార్లు, ఆటోలు, బస్సులు, మధ్య స్థాయి, భారీ రవాణా వాహనాలున్నాయి.
News March 20, 2025
2 రోజులు సెలవులు, 2 రోజులు ఆప్షనల్ హాలిడేస్

TG: హజ్రత్ అలి షహాదత్ను గుర్తు చేసుకుంటూ ఈ నెల 21న ఆప్షనల్ హాలిడే ఇచ్చిన ప్రభుత్వం అందులో మార్పు చేసింది. రంజాన్ నెల చంద్రవంక కనిపించడం ఆలస్యం కావడంతో మార్చి 22న ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. ఈ నెల 28న కూడా జుమతుల్ విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది. దీంతో స్కూళ్లు, కాలేజీలు ముఖ్యంగా మైనారిటీ సంస్థలు సెలవు ఇవ్వొచ్చు. ఇక తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31, ఏప్రిల్ 1న రంజాన్ సెలవులు ఉన్నాయి.
News March 20, 2025
నేడు వారికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు

TG: స్థానిక సంస్థల్లో కారుణ్య ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాల వారసులకు CM రేవంత్ నేడు నియామక పత్రాలను అందజేయనున్నారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో 582 మంది ఈ పత్రాలను అందుకోనున్నారు. జెడ్పీ, మండల పరిషత్తుల్లో ఉన్న 524 ఆఫీసు సబార్డినేట్, నైట్ వాచ్మెన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేశారు. దీంతో పాటు 58 జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించారు.