News April 2, 2025

TODAY HEADLINES

image

✒ రేపు లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు
✒ కర్ణాటకలో డీజిల్ ధర లీటర్‌కు రూ.2 పెంపు
✒ ఈ నెలలోనే మెగా DSC నోటిఫికేషన్: CBN
✒ జూన్ 12 లోపు తల్లికి వందనం: అచ్చెన్న
✒ మే నెల నుంచి కొత్త రేషన్‌కార్డులు: నాదెండ్ల
✒ కాకాణికి ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
✒ HCU భూమిని న్యాయంగానే తీసుకుంటున్నాం: భట్టి
✒ ఆ భూములు అటవీ శాఖ పరిధిలోనివి: బండి సంజయ్
✒ రైతులకు కన్నీళ్లే మిగిలాయి: KCR

Similar News

News January 13, 2026

రైల్వేకు రూ.1.3 లక్షల కోట్లు!.. సేఫ్టీకి ప్రయారిటీ

image

రైలు ప్రమాదాల నివారణకు వీలుగా కేంద్రం రానున్న బడ్జెట్లో ప్రయాణికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వనుందని ‘మింట్’ పేర్కొంది. ‘బడ్జెట్లో రైల్వేకు ₹1.3 లక్షల కోట్లు కేటాయించవచ్చు. ఇందులో సగం సేఫ్టీకి ఖర్చు చేస్తారు. ట్రాక్‌ల పునరుద్ధరణ, సిగ్నలింగ్ అప్‌గ్రేడ్, ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్‌ను విస్తరిస్తారు’ అని తెలిపింది. కాగా ఇటీవల ప్రమాద ఘటనలపై రాజకీయ విమర్శలతో కేంద్రం రైల్వేపై దృష్టి సారించింది.

News January 13, 2026

గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల

image

TG: సంక్రాంతి సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా స‌ర్పంచ్‌ల‌ు, వార్డు మెంబ‌ర్ల‌కు భట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

News January 13, 2026

షాక్స్‌గామ్ వ్యాలీ.. భారత్‌కు ఎందుకంత కీలకం?

image

<<18842137>>షాక్స్‌గామ్ వ్యాలీ<<>> భారత్‌కు భౌగోళికంగా, రక్షణ పరంగా చాలా కీలకం. ఇది ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. భారత్ మాత్రం దీన్ని తన భూభాగంగానే పరిగణిస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ శత్రువులకు పట్టు చిక్కితే లద్దాక్‌లోని సైనిక కదలికలను ఈజీగా గమనించొచ్చు. ఈ ప్రాంతం ద్వారా చైనా, పాక్ మధ్య రాకపోకలు పెరిగి ఒకేసారి భారత్‌పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది.