News August 28, 2025
TODAY HEADLINES

✷ తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
✷ వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ డెవలప్‌మెంట్: CM రేవంత్
✷ అర్హులెవరికీ అన్యాయం జరగదు: AP CM చంద్రబాబు
✷ APలో భారీ వర్షాలు.. నీటి ప్రాజెక్టులకు భారీగా వరద
✷ భారత్ మంచితనం.. పాక్‌లో 1.50 లక్షల మంది సేఫ్
✷ అమల్లోకి వచ్చిన 50% టారిఫ్స్
✷ IPLకు అశ్విన్ రిటైర్మెంట్
Similar News
News August 28, 2025
అమెరికాలో భారత వస్తువుల ధరలు పెంపు!

భారత్‌పై ట్రంప్ <<17529585>>టారిఫ్<<>> ఎఫెక్ట్ అమెరికాలో ధరలపై ప్రభావం చూపుతున్నాయి. టారిఫ్ పెంపుతో భారత వస్తువుల ధరలు 40-50శాతం పెంచుతున్నట్లుగా అమెరికాలోని గ్రాసరీ షాపుల ఎదుట పోస్టర్లు వెలిశాయి. దీంతో ఎన్ఆర్ఐలు, భారతీయ స్టూడెంట్లపై భారం పడే అవకాశముంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును వ్యతిరేకిస్తూ ట్రంప్ టారిఫ్ ఆంక్షలకు దిగారు. నిన్నటి నుంచి భారత్ ఎగుమతులపై 50శాతం టారిఫ్స్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
News August 28, 2025
సెల్యూట్ సర్(PHOTO)

TG: కామారెడ్డిలో <<17537949>>వరదలు<<>> జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పలు కాలనీలు నీట మునగగా అనేక మంది వరదలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు శ్రమించారు. భయంతో బిక్కుబిక్కుమంటున్న చిన్నారిని ఓ పోలీసు భుజాలపై సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. విపత్తులో సామాన్యులను రక్షించిన పోలీసులకు నెటిజన్లు సలాం చేస్తున్నారు.
News August 28, 2025
ప్రకాశం బ్యారేజీకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద!

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 3.8లక్షల క్యూసెక్కుల వరద ఇవాళ ఉదయం కల్లా ప్రకాశం బ్యారేజీకి చేరుతుందని అధికారులు అంచనా వేశారు. ఇది మరింత పెరగొచ్చని, మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశముందని చెప్పారు. పరీవాహక ప్రాంత ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.