News October 15, 2025
TODAY HEADLINES

* విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో AP ప్రభుత్వం ఒప్పందం
* అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు విశాఖకు గూగుల్: చంద్రబాబు
* బనకచర్లను ఆపండి.. CWCకి తెలంగాణ లేఖ
* జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT
* లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు
* RSS సమావేశాలపై బ్యాన్‌కు కర్ణాటక CM ఆదేశం
Similar News
News October 15, 2025
అదుపు తప్పిన మనసుకు మార్గదర్శనం ‘వేదం’

వేదం వైరాగ్యాన్ని బోధించదు. అది అదుపు తప్పే మానవ హృదయాలను ధర్మమార్గంలో నడిపిస్తుంది. అందుకే వేదాన్ని దివ్య జ్ఞాన సంపదగా పండితులు చెబుతారు. వేదంలో జీవిత పరమార్థం, ఆనందం, శాంతి సౌభాగ్యాల కోసం పవిత్రమైన ఆకాంక్ష నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వేదసారం సర్వమానవాళికి అందుబాటులోకి రావాలని వేదమే ఉద్ఘాటించింది. సత్యమైన జీవితాన్ని, సంతోషాన్ని పొందడానికి వేదం మార్గదర్శకమని గ్రహించాలి. <<-se>>#VedikVibes<<>>
News October 15, 2025
పత్తి నాణ్యత బాగుండాలంటే.. ఇలా చేయండి

తెలుగు రాష్ట్రాల్లో పత్తి తీతలో రైతులు నిమగ్నమయ్యారు. పత్తి నాణ్యత బాగుంటేనే అధిక ధర వస్తుంది. పంటకు మంచి ధర దక్కాలంటే పత్తి తీయగానే నీడలో మండెలు వేయాలి. దీనివల్ల గింజ బాగా గట్టిపడి, అందులో తేమశాతం తగ్గి పత్తి శుభ్రంగా ఉంటుంది. లేకుంటే గింజలు ముడుచుకుపోయి పత్తి తూకం తగ్గి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. పత్తిని నిల్వచేసే సంచులను శుభ్రంగా ఉంచాలి. వాటిలో దుమ్ము, ధూళీ లేకుండా చూస్తే పత్తి రంగు మారదు.
News October 15, 2025
నేటి నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం

అతి పెద్ద దేశవాళీ క్రికెట్ సమరం ‘రంజీ ట్రోఫీ 2025-26’ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ 91వ ఎడిషన్‌లో 38 జట్లు తలపడుతున్నాయి. విదర్భ డిఫెండింగ్ ఛాంపియన్‌గా, కేరళ జట్టు రన్నరప్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచులు జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఖేల్ టీవీలో లైవ్ చూడొచ్చు. ఈ సీజన్‌లో మొత్తం 138 మ్యాచులు జరగనున్నాయి. అత్యధికంగా ముంబై జట్టు 42సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచింది.