News December 3, 2025

TODAY HEADLINES

image

⋆ చేనేత, పవర్ లూమ్స్‌కు ఫ్రీ కరెంట్ : CM CBN
⋆ పదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: CM రేవంత్
⋆ పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై TG మంత్రుల ఆగ్రహం.. వ్యాఖ్యలను వక్రీకరించొద్దన్న జనసేన
⋆ TG: ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
⋆ పీఎంవో పేరు ‘సేవాతీర్థ్‌’గా మార్పు
⋆ రెండు దశల్లో జనగణన: కేంద్రం
⋆ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ తప్పనిసరి కాదు: కేంద్రం

Similar News

News March 5, 2026

ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు: చంద్రబాబు

image

AP: ఇక నుంచి ‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’ అని మాట్లాడాలని సీఎం CBN పిలుపునిచ్చారు. ‘ఫ్యామిలీ ప్లానింగ్ ఇప్పుడు అసంబద్ధం. జనాభా లేక ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువగా ఉంది. జనాభా తగ్గడం వల్ల రాజకీయంగా కూడా ఇబ్బందులు వస్తాయి. నేను రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడటం లేదు. ఏ దేశంలో ఎక్కువ జనాభా ఉంటే ఆ దేశం ధనిక దేశం అవుతుంది’ అని అసెంబ్లీలో చెప్పారు.

News March 5, 2026

గ్యాస్, ఆయిల్ కొరత లేదు: ప్రభుత్వ వర్గాలు

image

ఇంధన భద్రత విషయంలో ఇండియా కంఫర్టబుల్ పొజిషన్‌లోనే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘అవసరమైనంత మేర నిల్వలున్నాయి. రోజూ స్టాక్ నింపుతున్నాం. LPG/LNG కొరత లేదు. ప్రపంచంలో ముడి చమురుకు షార్టేజ్ లేదు. క్రూడ్, గ్యాస్ కొనుగోలు కోసం ఉత్పత్తిదారులు, వ్యాపారులు, IEA, OPECతో చర్చిస్తున్నాం. గ్యాస్ సరఫరాకు ఆస్ట్రేలియా, కెనడా ముందుకొచ్చాయి. UAE, USతో ఒప్పందం చేసుకున్నాం’ అని వెల్లడించాయి.

News March 5, 2026

జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: స్పీకర్

image

AP: మాజీ సీఎం జగన్ మినహా YCP MLAలు అసెంబ్లీకి రాకపోయినా జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం జరగదని తేల్చిచెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం రోజు సభకు హాజరైనా పరిగణనలోకి రాదు. వరుసగా 65 రోజులు గైర్హాజరైతే నోటీసులిస్తాం. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్‌ను సంప్రదిస్తా. సభకు రాని MLAలపై చర్యలు తీసుకునే చట్టాలను పార్లమెంటులోనే చేయాలి’ అని పేర్కొన్నారు.