News January 8, 2026

TODAY HEADLINES

image

☛ 2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం: CM CBN
☛ అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ
☛ ఏపీలో ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షో టికెట్ రూ.1000
☛ TGలో మున్సిపల్ ఎన్నికలు.. ఈనెల 16న ఓటర్ల తుది జాబితా విడుదల
☛ TGలో సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు
☛ ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత
☛ T20 WC: భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచులు!

Similar News

News January 11, 2026

ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

image

AP: ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నారు. 13,257 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

News January 11, 2026

డియర్ పేరెంట్స్.. పిల్లలు జాగ్రత్త

image

సంక్రాంతికి పిల్లలంతా గాలిపటాలు ఎగరేసే ఉత్సాహంలో ఉంటారు. ఒకవైపు చైనా మాంజా ప్రమాదకారిగా మారితే.. మరోవైపు విద్యుత్ షాక్‌లు పేరెంట్స్‌ను కంగారు పెడుతున్నాయి. అన్నమయ్య జిల్లా గోరంచెరువు గ్రామంలో గాలిపటం ఎగరవేస్తూ విద్యుత్ తీగలు తగిలి ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. డాబాలు, అపార్ట్‌మెంట్లు కాకుండా ఓపెన్ ప్లేస్, గ్రౌండుకు తీసుకెళ్లి పతంగి ఎగరేయించండి. బాల్కనీల్లో గాలిపటాలు ఎగరేయడం ప్రమాదకరం. ShareIt.

News January 11, 2026

11x12x20: మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేసే మ్యాజిక్ ఫార్ములా

image

ఎంత డబ్బు సంపాదించినా దాన్ని సరిగా ఇన్వెస్ట్ చేసే తెలివి ఉండాలి. 11x12x20 సింపుల్ ఫార్ములా అందుకు ఒక స్మార్ట్ వే. నెలకు ₹11,000 చొప్పున 12% రిటర్న్స్ ఇచ్చే సాధనాల్లో 20 ఏళ్లు SIP చేయాలి. చివరకు కాంపౌండింగ్ మ్యాజిక్‌తో మీ చేతికి ఏకంగా ₹కోటి వస్తాయి. మీరు పెట్టేది కేవలం ₹26.4 లక్షలే అయినా వచ్చే లాభం మాత్రం ₹83.5 లక్షలు. రిటైర్మెంట్ ప్లాన్ లేదా పిల్లల చదువుల కోసం ఇది బెస్ట్ ఆప్షన్.