News January 16, 2026
TODAY HEADLINES

⭒ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
⭒ మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN
⭒ దేశ భద్రత విషయంలో TG ముందుంటుంది.. ఆర్మీ అధికారులతో CM రేవంత్
⭒ రాయలసీమ లిఫ్ట్‌ను KCRకు జగన్ తాకట్టు పెట్టారు: సోమిరెడ్డి
⭒ TG: ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌కు స్పీకర్ క్లీన్ చిట్
⭒ BMCలో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
⭒ U19 WC: USAపై IND గెలుపు
Similar News
News January 16, 2026
గ్రీన్‌లాండ్‌కు భారీగా యూరోపియన్ సైనిక బలగాలు

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ <<18784880>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో యూరోపియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. డెన్మార్క్‌కు మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నార్వే సహా పలు దేశాలు గ్రీన్‌లాండ్‌కు సైనిక బలగాలను పంపుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్ సైనికులు గ్రీన్‌లాండ్ రాజధాని నూక్ చేరుకోగా, జర్మనీ సైతం సైనిక బృందాన్ని మోహరించింది. నాటో దేశాల ఐక్యతను చూపించేందుకే ఈ బలగాల మోహరింపు అని సమాచారం.
News January 16, 2026
సాగులో అండగా నిలిచే గోవులను ఇలా పూజిద్దాం

కనుమ రోజున ఆవులను, ఎడ్లను నదులు, చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తే ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చంటారు.
News January 16, 2026
రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్.. వీటిలో పుష్కలం

మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాల్లో విటమిన్-C ఒకటి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి, గాయాలు త్వరగా మానడానికి ఇది కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయ, జామకాయ, నారింజ, బత్తాయి, ద్రాక్ష, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, కివీ వంటి పండ్లలో ఇది పుష్కలంగా లభిస్తుంది. కూరగాయల్లో టమోటాలు, ఆకుకూరలు, క్యాప్సికమ్, మునగాకులో ఎక్కువగా ఉంటుంది.


