News February 3, 2026
TODAY HEADLINES

* భారత సరిహద్దుల్లోకి చైనా చొరబడుతోంది: రాహుల్
* రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రుల అభ్యంతరం
* HYD TO BLR.. 2 గంటల్లో వెళ్లొచ్చు: అశ్వినీ వైష్ణవ్
* లా అండ్ ఆర్డర్ సమస్యకు YCP యత్నం: CBN
* లోకేశ్ నన్ను హతమార్చాలని చూస్తున్నారు: జోగి
* TG: మున్సి‘పోల్స్’’: 19,608 నామినేషన్లు ఓకే
* సిట్ విచారణ.. కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు
* భారత్‌పై టారిఫ్‌లను 25%-18 శాతానికి తగ్గించిన అమెరికా
Similar News
News February 3, 2026
సమీకృత సాగు.. భూమిని బట్టి ఒక్కో విధానం

సమీకృత వ్యవసాయంలో ఏ భూములు వేటి పెంపకానికి అనుకూలమో చూద్దాం ☛ బీడుభూములు – పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం, వ్యవసాయ అడవుల పెంపకం, వ్యవసాయ చెరువులకు అనుకూలం. ☛ తోట భూములు – పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, పందుల పెంపకం, పుట్టగొడుగులు, తేనె తయారీ, పట్టు పురుగుల పెంపకానికి అనుకూలం. ☛ తడి భూములు – పంటలు, చేపలు, బాతులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పశువుల పెంపకానికి అనుకూలం.
News February 3, 2026
దేవతా విగ్రహాలు ఏ దిశలో ఉండాలి?

ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఉండే పూజా గది ఈశాన్యంలో ఉండడం శుభదాయకం. దేవుడి విగ్రహాలను తూర్పు దిశలో అమర్చాలి. అంటే ఆ విగ్రహాలు పశ్చిమ దిశను చూస్తున్నట్లుగా ఉండాలి. ఇలా ఉంచడం వల్ల మనం పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చుంటాము. ఇది ఏకాగ్రతను పెంచి ఇంట్లో ప్రశాంతతను, సానుకూల శక్తిని చేకూరుస్తుంది. ఈ దిశల అమరిక వల్ల దైవ స్వరూపాల నుంచి వచ్చే శక్తి ఇల్లంతా ప్రసరించి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది.
News February 3, 2026
FPIల నుంచి భారీగా పెట్టుబడుల ఉపసంహరణ

అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. జనవరిలోనే ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.36 వేల కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. డెరివేటివ్‌లపై సెక్యూరిటీ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ భారీ పెంపుతో భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ఛాన్సుంది. 2025లో FPIలు రూ.1.66 లక్షల కోట్ల(18.9 బి.డాలర్లు) పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.


