News February 5, 2026
TODAY HEADLINES

☛ TG: మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా: రేవంత్
☛ రేవంత్ ముస్లింల కోసమే పని చేస్తున్నారు: నితిన్ నబీన్
☛ AP: చంద్రబాబుతో పవన్ భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
☛ ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్: CM CBN
☛ గుంటూరులో జగన్ పర్యటన.. కూటమి ప్రభుత్వంపై ఫైర్
☛ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ప్రారంభం
☛ U19 WC: ఫైనల్‌కు చేరిన భారత్
Similar News
News February 5, 2026
గ్రూప్-1 నియామకాలపై నేడు హైకోర్టు తీర్పు

TG: గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. నియామకాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించనుంది. పరీక్షల నిర్వహణ, కరెక్షన్ వంటి నిబంధనల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని పలువురు గతంలో HCని ఆశ్రయించారు. దీంతో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా ఇవాళ తీర్పుతో 562 పోస్టుల భవితవ్యం తేలనుంది.
News February 5, 2026
మల్లె సాగు – అనువైన రకాలు

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.
News February 5, 2026
కానుగ నీడ, కన్నతల్లి నీడ

ప్రకృతిలో లభించే నీడలలో కానుగ చెట్టు నీడ అత్యంత చల్లనిదిగా పరిగణించబడుతుంది. ఇతర చెట్ల కంటే దీని ఆకులు దట్టంగా ఉండి, ఎండను అసలు చొరబడనీయకుండా ఉంటాయి. అందుకే ఈ చెట్టు కింద సేద తీరితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక బిడ్డకు తన కన్నతల్లి ఒడి ఎంతటి భద్రతను, చల్లదనాన్ని, ఓదార్పును ఇస్తుందో.. ఎండలో అలసిపోయిన బాటసారికి కానుగ చెట్టు నీడ అంతటి ఉపశమనాన్ని ఇస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.


