News March 15, 2026

TODAY HEADLINES

image

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్

Similar News

News March 20, 2026

రేషన్‌కార్డులు ఉన్నవారికి సీఎం గుడ్ న్యూస్

image

TG: బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ <<19431944>>పథకంపై<<>> సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఫ్యామిలీకి ఈ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. ‘కేవలం మాటలకే పరిమితం కాకుండా సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే మా లక్ష్యం. తెలంగాణలో పుట్టడం, జీవించడం ఒక వరంగా భావించేలా మా ప్రభుత్వం పనిచేస్తుంది’ అని మీడియాతో చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.

News March 20, 2026

రూ.5.62 లక్షల కోట్లకు చేరువగా రుణభారం!

image

తెలంగాణలో అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంపై రుణభారం రూ.5.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2025-26లో రుణభారం రూ.5.03 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అదనంగా మరో రూ.59,000 కోట్లు పెరగనుంది. రుణభారం ఈ విధంగా పెరగడం వల్ల, ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు సేకరించే విషయంలో ప్రభుత్వానికి ఆటంకాలు తప్పేలా లేవు.

News March 20, 2026

రేపు, ఎల్లుండి వర్షాలు: APSDMA

image

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనంతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు అన్ని జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని తెలిపిింది.