News March 27, 2026

TODAY HEADLINES

image

*పశ్చిమాసియా సంక్షోభం.. సీఎంలతో రేపు మోదీ మీటింగ్
*AP: మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
*అమరావతికి చట్టబద్ధత కల్పించేలా క్యాబినెట్ తీర్మానం
*నియోజకవర్గాలు 50% పెరుగుతాయి: CBN
*TG: ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.89 కోట్లు: రేవంత్
*మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి
*IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల

Similar News

News April 6, 2026

₹6.5 లక్షల కోట్లకు బంగారం దిగుమతులు

image

గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలోకి బంగారం దిగుమతులు 28.73% పెరిగాయి. వీటి విలువ సుమారు ₹6.5 లక్షల కోట్లుగా నమోదైంది. పసిడి ధరలు భారీగా పెరగడమే దీనికి కారణం. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,50,000 దాటిపోయింది. స్విట్జర్లాండ్ నుంచి అత్యధికంగా 40% బంగారం దిగుమతి అవుతోంది. ఈ దిగుమతుల ప్రభావంతో దేశ వాణిజ్య లోటు కూడా పెరిగి ₹29.20 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

News April 6, 2026

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సెటైర్లు!

image

హార్ముజ్ జలసంధిని తెరవకపోతే నరకానికి పంపుతానంటూ బూతులతో ట్రంప్ <<19575126>>హెచ్చరించడం<<>>పై ఇరాన్ సెటైర్లు వేస్తోంది. ‘ఓ టీనేజర్‌లా అధ్యక్షుడు బూతులు తిట్టే తీరు చూస్తుంటే.. అమెరికా ఊహించిన దాని కంటే ముందే రాతియుగానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది’ అని థాయ్‌లాండ్‌లోని ఇరాన్ ఎంబసీ ఎద్దేవా చేసింది. ‘ట్రంప్.. ఇంకేదైనా మాట్లాడవా. బోర్ కొడుతోంది’ అంటూ జింబాబ్వేలోని ఎంబసీ ఎగతాళి చేసింది.

News April 6, 2026

‘కిస్సింగ్ డిసీజ్‌’తో చాలా డేంజర్

image

జ్వరం, నీరసం, గొంతు నొప్పితో వచ్చే ‘మోనో’ అనే ఇన్ఫెక్షన్‌ను చాలా మంది లైట్ తీసుకుంటారు. కిస్ చేయడం, డ్రింక్ షేర్ చేసుకోవడం, దగ్గు వల్ల ఇది వ్యాపిస్తుంది. అందుకే దీన్ని కిస్సింగ్ డిసీజ్ అంటారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) అనే ప్రాణాంతక జబ్బు వచ్చే ప్రమాదం ఉందని ‘న్యూరాలాజీ ఓపెన్ యాక్సెస్’లో పబ్లిష్ అయిన స్టడీ తెలిపింది. MS వల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయి.