News March 27, 2026

TODAY HEADLINES

image

*పశ్చిమాసియా సంక్షోభం.. సీఎంలతో రేపు మోదీ మీటింగ్
*AP: మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
*అమరావతికి చట్టబద్ధత కల్పించేలా క్యాబినెట్ తీర్మానం
*నియోజకవర్గాలు 50% పెరుగుతాయి: CBN
*TG: ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.89 కోట్లు: రేవంత్
*మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి
*IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల

Similar News

News April 6, 2026

‘చర్చకు సిద్ధం’.. విజయన్‌కు రేవంత్ కౌంటర్

image

TG: రాష్ట్ర పాలనపై కేరళం CM పినరయి <<19557717>>విజయన్<<>> చేసిన ట్వీట్లపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ లేఖ ద్వారా బదులిచ్చారు. విజయన్ పేర్కొన్న గణాంకాలన్నీ BRS హయాంలోనివని (2023-24) వివరిస్తూ ఆరు పేజీల లేఖ రాశారు. 28నెలల్లోనే 67,763 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, రాష్ట్ర GSDP గ్రోత్ (10.1%) జాతీయ సగటు (9.9%) కంటే ఎక్కువ ఉందని పేర్కొన్నారు. APR 7న తిరువనంతపురం వచ్చి గణాంకాలతో చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.

News April 6, 2026

TTD నిత్యాన్నదానం.. దాతలకు సీఎం అభినందన

image

AP: TTD నిత్యాన్నదాన పథకానికి సహకరిస్తున్న దాతలకు CM CBN అభినందనలు తెలిపారు. శ్రీవారి సన్నిధిలో 1985 APR 6న నాటి సీఎం NTR ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రోజుకు 2 వేల మందితో ప్రారంభమై నేడు 2.80L మందికి అన్నదానం అందించే స్థాయికి చేరిందన్నారు. ప్రస్తుతం ట్రస్ట్ మూలనిధి రూ.2,500 కోట్లు దాటిందని చెప్పారు. ఈ స్కీమ్ స్ఫూర్తితో ప్రాణదానం, విద్యాదానం ట్రస్టులు ఏర్పాటుచేసినట్లు Xలో పేర్కొన్నారు.

News April 6, 2026

అలర్ట్: రోజుకో టైమ్‌కు పడుకుంటున్నారా?

image

రోజుకో సమయానికి పడుకోవడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతిని BP, హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని 3,000 మందిపై జరిపిన స్టడీ తేల్చింది. 7-8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో ఈ ముప్పు అధికమని హెచ్చరించింది. ఉదయం నిద్రలేచే సమయం కంటే రాత్రి పడుకునే టైమ్‌ స్థిరంగా ఉంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని స్పష్టం చేసింది.