News May 13, 2024
TODAY HEADLINES

* రేపు నాలుగో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
* యువరాజు వయసు కంటే కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు: మోదీ
* TS: తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: రేవంత్
* AP: ఫేక్ ప్రచారాలను నమ్మకండి: చంద్రబాబు
* ఓటర్లను అడ్డుకుంటే కఠిన చర్యలు: ముకేశ్ కుమార్
* అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్: కేజ్రీవాల్
Similar News
News March 18, 2026
99.93% ఓట్లతో కిమ్ విక్టరీ.. మరి వారి సంగతేంటో?

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆధ్వర్యంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది. 99.99%లో కిమ్‌కు ఫేవర్‌గా 99.93% ఓట్లు పడ్డాయి. ఇక 0.07% ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో వారి గతేమవుతుందోనని SMలో మీమ్స్ పేలుతున్నాయి. ఎన్నికలు పారదర్శకంగా సాగాయని చూపడానికి కిమ్ వేసే ఎత్తుగడ అని మరికొందరు చెబుతున్నారు. కాగా కిమ్ మరోసారి సుప్రీంలీడర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
News March 18, 2026
‘షోలే x 100’: ధురంధర్-2పై RGV రివ్యూ!

‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను చూసిన డైరెక్టర్ RGV ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ ‘షోలే’ కంటే 100 రెట్లు గొప్పదని, దీని ముందు ‘మొఘల్-ఎ-ఆజమ్’ వంటి క్లాసిక్స్ కూడా TV సీరియల్స్‌లా కనిపిస్తాయన్నారు. సినిమా ప్రపంచంలో ఇది కొత్త శకానికి నాంది అన్నారు. హాలీవుడ్ దిగ్గజాలు స్పీల్‌బర్గ్, నోలన్ సైతం పనులు పక్కన పెట్టి ఈ సినిమా చూడాలని సలహా ఇచ్చారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ టాలెంట్‌ను ఆకాశానికెత్తేశారు.
News March 18, 2026
ఐటీ స్టాక్స్ కొనుగోలు.. మార్కెట్లకు లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లో లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 600 పాయింట్ల లాభంతో 76,671కు చేరగా నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 23,796 వద్ద సెటిల్ అయింది. ఐటీ షేర్లలో కొనుగోలు, సీహన్ పోర్టు మీదుగా ఇరాక్ ఆయిల్ ఎగుమతికి తుర్కియే అంగీకరించడంతో చమురు ధరలు కంట్రోల్‌లో ఉండటం, ఇతర రంగాల్లోనూ వాల్యూ బయింగ్ కలిసొచ్చింది. టెక్ మహీంద్రా, ఎటర్నల్, ఇన్ఫోసిస్ 3% లాభాలు నమోదు చేశాయి.


