News May 19, 2024

TODAY HEADLINES

image

☞ మన దెబ్బకు పాకిస్థాన్ బిచ్చమెత్తుకుంటోంది: మోదీ
☞ AP: ఎన్నికల ఘర్షణలపై SIT విచారణ మొదలు
☞ AP: జగనే సీఎం.. సంబరాలకు సిద్ధం కండి: YSRCP
☞ AP: బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ
☞ TG: ఈసీ అనుమతి లేక కేబినెట్ భేటీ వాయిదా
☞ TG: EAPCET ఫలితాలు విడుదల
☞ TG: రేవంత్ టెన్షన్‌లో ఉన్నారు: DK అరుణ
☞ ఏ ప్రభుత్వమూ రాజ్యాంగాన్ని మార్చలేదు: గడ్కరీ

Similar News

News November 23, 2025

సత్యసాయి సేవలు విశ్వవ్యాప్తం: కలెక్టర్ కీర్తి

image

తల్లికిచ్చిన మాట కోసం పుట్టపర్తి నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించిన మహనీయుడు సత్యసాయి అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కొనియాడారు. ఆదివారం ఆర్కాట్ తోటలోని సత్యసాయి సేవా సమాజంలో జరిగిన శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రేమ, సేవా భావంతో బాబా చూపిన మార్గం నేటి సమాజానికి ఆదర్శమని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

News November 23, 2025

భూమిలో కర్బన నిల్వల స్థాయి టెస్టింగ్ ఇలా..

image

ఒక చెంచాతో 1 గ్రాము మట్టిని, 2ml పొటాషియం డైక్రోమేట్‌తో పాటు 2ml సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఒక సీసాలో పోసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ సీసాలో నీటిని పోయాలి. ఆ ద్రావణం మారిన రంగును బట్టి భూమిలో కర్బన శాతం తెలుసుకోవచ్చు. ☛ నారింజ/పసుపు రంగు – కర్బన స్థాయి తక్కువ ☛ ముదురు గోధుమ/ నలుపు రంగు – కర్బన స్థాయి మధ్యస్థం ☛ ఆకు పచ్చ/ నీలి రంగు – కర్బన స్థాయి ఎక్కువ.

News November 23, 2025

2 రోజుల్లోనే ముగిసిన టెస్టు.. రూ.17.35 కోట్ల నష్టం!

image

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు కేవలం 2 రోజుల్లో ముగియడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియాకు భారీ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగో రోజులకు అమ్మకానికి ఉంచిన టికెట్‌ ఆదాయం కోల్పోవడంతో దాదాపు రూ.17.35 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. మూడో రోజు టికెట్లు దాదాపు అమ్ముడుపోయినట్లు సమాచారం. మొదటి రెండు రోజుల్లోనే లక్షకుపైగా అభిమానులు హాజరైనా, తర్వాతి రోజుల ఆదాయం కోల్పోవడం గట్టిదెబ్బే.