News May 24, 2024
TODAY HEADLINES

* AP: మాచర్ల ఎమ్మెల్యే PRKకు ఊరటనిచ్చిన హైకోర్టు
* రిగ్గింగ్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు: అనిల్ కుమార్
* చంద్రబాబు వద్ద కొత్త ప్యాకేజీ స్టార్ ప్రశాంత్ కిషోర్: వైసీపీ
* TG: మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి: కేటీఆర్
* సీఎంకు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యం: కిషన్ రెడ్డి
* జూన్ 4 తర్వాత వైసీపీ దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
* ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Similar News
News January 11, 2026
పసిపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

శీతాకాలంలో పసిపిల్లలు ఎక్కువగా జలుబుకు గురవుతారు. అయితే ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించడం సులువవుతుందంటున్నారు నిపుణులు. శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు/ నీలం రంగులో కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. అలాగే శ్వాస వేగంగా తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News January 11, 2026
జనసేనతో పొత్తు అవసరం లేదు: రాంచందర్

TG: మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో BJPకి పొత్తు అవసరం లేదని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. APలో పరిణామాల ఆధారంగానే కూటమి ఏర్పాటైందని, ఇక్కడ తాము బలంగా ఉన్నట్లు చెప్పారు. పొత్తు ఉంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అధిష్ఠానానికీ ఇదే విషయం చెబుతామన్నారు. కాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమని JSP నిన్న ప్రకటించింది.
News January 11, 2026
ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో ఉద్యోగాలు

ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో 45 జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JSOకు నెలకు రూ.68,697, JSAకు రూ.42,632 చెల్లిస్తారు. https://fsl.delhi.gov.in


