News June 14, 2024
TODAY HEADLINES

* ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
* మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన CBN
* కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్
* వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు: మంత్రి నిమ్మల
* కూటమి విజయానికి పవనే కారణం: YCP ఎమ్మెల్సీ
* TG:రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు: CS శాంతి కుమారి
* పాఠ్యపుస్తకాల నుంచి కేసీఆర్ ఫొటో తొలగింపు సరికాదు: సబిత
Similar News
News January 10, 2026
ధనుర్మాసం: ఇరవై ఆరో రోజు కీర్తన

‘ఓ వటపత్రశాయీ! వ్రతం కోసం నీ చెంతకు వచ్చాము. మా పూర్వీకులు నడిచిన బాటలో ఈ వ్రతానికి కావాల్సిన పరికరాలను ప్రసాదించమని వేడుకుంటున్నాము. నీ పాంచజన్యం వంటి తెల్లని శంఖాలు, వాద్యాలు, మంగళ గానాలు పాడే భక్తుల సమూహం మాకు కావాలి. వెలుగునిచ్చే మంగళ దీపాలు, వ్రత ధ్వజాలు అనుగ్రహించు. లోకాన్నంతా నీ కుక్షిలో ఉంచుకోగల నీకు ఇవి ఇవ్వడం కష్టమేం కాదు. కరుణించి మా వ్రతం విజయవంతమయ్యేలా దీవించు స్వామీ!’ <<-se>>#DHANURMASAM<<>>
News January 10, 2026
ఫిబ్రవరి 14న మున్సిపల్ ఎన్నికలు!

TG: రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నికలను ఫిబ్రవరి 14న నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 17న ప్రకటించొచ్చని తెలుస్తోంది. BCలకు 32% రిజర్వేషన్లు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 2,996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం రూ.85 కోట్లు విడుదల చేయాలని పురపాలక శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది.
News January 10, 2026
ఆస్కార్ బరిలో భారత్ నుంచి మరిన్ని చిత్రాలు

ఈ ఏడాది ఆస్కార్ రేసులో తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో పోటీ పడనుంది. ఇక హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన <<18806607>>కాంతార<<>>: చాప్టర్-1, మహావతార్ నరసింహ చిత్రాలు జనరల్ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. ఇవి ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి విభాగాల్లో సెలక్ట్ అయ్యాయి. అలాగే తన్వీ ది గ్రేట్, సిస్టర్ మిడ్నైట్, హోమ్బౌండ్ సినిమాలు ఉన్నాయి.


