News March 24, 2024
TODAY HEADLINES
* ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగింపు
* జీవో 317 సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తాం: CM రేవంత్
* ఏపీలో NDAకు 160కి పైగా సీట్లు వస్తాయి: CBN
* సినీ నటులకు మించిన క్రేజ్ CM జగన్ సొంతం: రోజా
* రెండు అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన
* కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు ఢిల్లీ HC నిరాకరణ
* IPL: ఢిల్లీపై పంజాబ్, SRHపై KKR విజయం
* మాస్కోలో ఉగ్రదాడి.. 150 మంది మృతి
Similar News
News November 2, 2024
PIC OF THE DAY
న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఆకట్టుకుంది. డైవ్ క్యాచ్‌తో పాటు ఫీల్డింగ్‌లో అదరగొట్టారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈరోజు మ్యాచ్ పూర్తయ్యే సరికి కోహ్లీ జెర్సీ బురదమయంగా మారిన ఫొటోను షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని కొనియాడుతున్నారు. టీమ్ గెలుపుకోసం ఎంతో కష్టపడతారని అభినందిస్తున్నారు. అయితే, బ్యాటింగ్‌లోనూ ఇదే కసి ఉండాల్సిందని మరికొందరు సూచిస్తున్నారు.
News November 2, 2024
ఒంటి కాలు మీద ఎంతసేపు నిలబడగలరు?
ఒంటి కాలు మీద నిలబడే సామర్థ్యాన్ని బట్టి వ్యక్తి నాడీ-కండరాల పనితీరును తెలుసుకోవచ్చని ప్రముఖ వైద్యులు సుధీర్ కుమార్ తెలిపారు. 30 ఏళ్ల వ్యక్తి కళ్లు తెరిచి ఉంచి 45 సెకండ్ల కంటే ఎక్కువ సేపు నిలబడగలగాలని సూచించారు. అయితే, ఈ సామర్థ్యం వయసు రీత్యా తగ్గుతూ వస్తుందని వెల్లడించారు. 50ఏళ్ల వ్యక్తి 40Secs, 70 ఏళ్ల వ్యక్తి 20 సెకండ్లు ఒంటికాలిపై నిల్చోగలరని చెప్పారు. కళ్లు మూస్తే ఎక్కువసేపు నిల్చోలేరన్నారు.
News November 2, 2024
రిషికొండలోకి అందరినీ అనుమతిస్తాం: చంద్రబాబు
AP: రిషికొండ నిర్మాణాలు పూర్తయ్యాక అందరినీ అనుమతిస్తామని CM చంద్రబాబు తెలిపారు. దీనిని దేనికి ఉపయోగించాలో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘అందరితో చర్చించిన తర్వాత దీనిపై ఓ నిర్ణయానికి వస్తాం. అధికారంలో శాశ్వతంగా ఉంటామనే భ్రమలో ఈ ప్యాలెస్ కట్టారు. ఒక్క భవనం కోసం సబ్ స్టేషన్, సెంట్రల్ AC, ఫ్యాన్సీ ఫ్యాన్లు ఎందుకు? పేదలను ఆదుకునేవారు ఇలాంటివి కడతారా?’ అని ప్రశ్నించారు.