News June 19, 2024
TODAY HEADLINES

✒ 17వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల
✒ NDA నేతలు కొందరు టచ్‌లో ఉన్నారు: రాహుల్
✒ AP: బ్యాలెట్‌తో ఓటింగ్ నిర్వహించాలన్న జగన్.. కూటమి నేతల విమర్శలు
✒ AP: సర్టిఫికెట్లపై ఎలాంటి ఫొటోలు ఉండొద్దు: ప్రభుత్వం
✒ AP: సచివాలయానికి పవన్.. రైతుల ఘనస్వాగతం
✒ AP: 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు
✒ TG: విద్యార్థులు ITIలలో చేరాలి: సీఎం రేవంత్ పిలుపు
✒ TG: కేసీఆర్ తొందరపాటుతో రూ.81వేల కోట్ల అప్పు: కోదండరాం
Similar News
News March 4, 2026
మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్ షాకు సీఎం రిపోర్ట్

ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం నివేదిక ఇచ్చారు. ఆపరేషన్ కగార్‌కు తెలంగాణ పోలీసులు సహకరించారని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని షా కోరారు. తెలంగాణలో ఈగల్ టీమ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు గురించి రేవంత్ వివరించారు. రాష్ట్రానికి IPS క్యాడర్‌ను పెంచాలని కోరారు.
News March 4, 2026
రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ చేసింది. వీరు రేపు నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ సలహాదారుగా ఉన్నారు.
News March 4, 2026
DMKతో పొత్తు ఖరారు.. 28 సీట్లలో కాంగ్రెస్ పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో DMK-కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పలుమార్లు చర్చలు, చిదంబరం-స్టాలిన్ భేటీ అనంతరం రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాంగ్రెస్‌కు 28 స్థానాలు కేటాయించేందుకు DMK అంగీకరించింది. అలాగే ఓ రాజ్యసభ సీటును ఇవ్వనుంది. 234 సీట్లున్న TN అసెంబ్లీకి వచ్చే ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.


