News July 2, 2024

TODAY HEADLINES

image

* AP: టెట్ నోటిఫికేషన్ విడుదల
* AP: తొలిరోజు 95% పెన్షన్ల పంపిణీ
* విభజన హామీలపై చర్చకు ఆహ్వానిస్తూ రేవంత్‌కు CBN లేఖ
* వైసీపీ వాళ్లు నాకు శత్రువులు కాదు: పవన్ కళ్యాణ్
* కాంగ్రెస్‌లో చేరిన MLAలతో రాజీనామా చేయించాలి: KTR
* సీతక్కకు హోంమంత్రి పదవి?: మంత్రి రాజనర్సింహ
* భారత్‌లో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు
* పార్లమెంటులో రాహుల్ ‘హిందూ’ వ్యాఖ్యలపై వివాదం

Similar News

News December 2, 2025

కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. చెన్నై సమీపంలో ఉన్న వాయుగుండం నెమ్మదిగా కదులుతుందని పేర్కొన్నారు. సాయంత్రం తీరాన్ని తాకే అవకాశం ఉందని, ఆ సమయంలోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. గత రెండు రోజులుగా ఈ జిల్లాల్లో వానలు పడుతున్న సంగతి తెలిసిందే.

News December 2, 2025

3,058 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

రైల్వేలో 3,058 NTPC (UG) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. వీటిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, Jr క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన, 18- 30 ఏళ్ల మధ్య గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CBT, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 2, 2025

NSICలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(NSIC)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, MSME రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nsic.co.in