News July 5, 2024

TODAY HEADLINES

image

* ముంబైలో టీమ్‌ఇండియా ర్యాలీ.. ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన మెరైన్ రోడ్డు
* కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తాం: సీఎం రేవంత్
* ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు: కేసీఆర్
* ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రులతో AP సీఎం CBN భేటీ
* చంద్రబాబూ.. ఎల్లకాలం మీ రోజులే ఉండవు: జగన్
* ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
* హాథ్రస్ తొక్కిసలాటలో ఆరుగురు అరెస్ట్, పరారీలో భోలేబాబా

Similar News

News March 3, 2026

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

image

TG: బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని CM రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. 12 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రాన్ని BRS, INC అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు.

News March 3, 2026

BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>BSNL<<>>లో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 7 వరకు ఆఖరు తేదీ కాగా.. మార్చి 31 వరకు పొడిగించారు. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ ఏప్రిల్ 1 – 8వరకు చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. వెబ్‌సైట్: bsnl.co.in/

News March 3, 2026

భారత్ చేరుకున్న పీవీ సింధు

image

యుద్ధం వల్ల దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. సింధుతో పాటు మరికొంత మంది ప్రయాణికులు స్వస్థలాలకు చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తిరిగి స్వదేశానికి చేరుకోవడం ఆనందంగా ఉందని సింధు ట్వీట్ చేశారు. ఇందుకు సహకరించిన UAE అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి థాంక్స్ చెప్పారు.