News July 7, 2024

TODAY HEADLINES

image

* AP, TG సీఎంల భేటీ.. విభజన సమస్యలపై చర్చ!
* రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు: జగన్
* TGలో ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్
* తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకే
* ఈనెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
* రూ.800 కోట్లు దాటిన ‘కల్కి 2898AD’ కలెక్షన్స్
* తొలి టీ20లో భారత్‌పై జింబాబ్వే విజయం
* ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియన్

Similar News

News March 3, 2026

మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?

image

ఇజ్రాయెల్, US-ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్‌కు వ్యాపించింది. US-ఇజ్రాయెల్‌కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అండగా నిలిచాయి. ఇరాన్‌కు సాయం చేస్తామని చైనా ప్రకటించింది. మిడిల్ ఈస్ట్‌లో మొదలైన యుద్ధం Asia, europe దేశాలకు పాకి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోగా నిత్యావసరాలపైనా వార్ ఎఫెక్ట్ పడుతుందేమోనని సామాన్యుడిలో ఆందోళన నెలకొంది.

News March 3, 2026

ఉస్తాద్ భగత్‌సింగ్ పేరు అందుకే మార్చాం: హరీశ్ శంకర్

image

ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టైటిల్‌ను తొలుత ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనుకున్నట్లు డైరెక్టర్ హరీశ్ శంకర్ వెల్లడించారు. కానీ, ఆ పేరు SMలో లీకై ‘భవదీయుడు’ అంటే అర్థం ఏంటని GenZల నుంచి సందేహాలు వచ్చాయన్నారు. పేరు అర్థం కాకపోతే ఎలా అని ఆలోచించి ఉస్తాద్ భగత్‌సింగ్ ఖరారు చేసినట్లు చెప్పారు. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశామనేది సినిమా చూస్తే తెలుస్తుందన్నారు. అలాగే ఈ సినిమా రీమేక్ కాదని మరోసారి స్పష్టం చేశారు.

News March 3, 2026

హార్ముజ్‌లోకి షిప్పులు వస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్‌

image

హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. తమ అనుమతి లేకుండా ఏ ఓడ వచ్చినా తగలబెట్టేస్తామని IRGC హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% ఈ మార్గం నుంచే వెళ్తుంది. వాస్తవానికి ఇరాన్ దాడుల భయంతో మార్చి 1 నుంచే ఈ మార్గం నుంచి షిప్పులు వెళ్లడం లేదు. మరోవైపు కువైట్‌లో ఉన్న పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికన్ మిలిటరీ బేస్‌పై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసింది.