News July 14, 2024
TODAY HEADLINES

➥ అనంత్-రాధికల ‘ఆశీర్వాద్’ వేడుక.. ప్రముఖుల హాజరు
➥ AP: ప్రజల వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ: CM
➥ AP: త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: DGP
➥ AP: 37 మంది IPSల బదిలీ
➥ AP: ప్రతి విద్యార్థికీ ₹15వేలు: నిమ్మల
➥ AP: రెడ్ బుక్ కాదు హామీలు అమలు చేయండి: అంబటి
➥ TG: పెండింగ్ లేకుండా రీయింబర్స్మెంట్ చెల్లిస్తాం: CM
➥ TG: అక్రమ పెన్షన్ల రికవరీకి ప్రభుత్వం ఆదేశం
➥ TG: ‘కల్కి’ని మించిన INC వసూళ్లు: KTR
Similar News
News December 8, 2025
సమ్మిట్ గెస్టుల కోసం తెలంగాణ చిరుతిళ్లు

TG: ఈరోజు, రేపు జరగనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథుల కోసం తెలంగాణ స్పెషల్ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. చిరుతిళ్లతో కూడిన ప్రత్యేక డైట్ కిట్‌ను వారికి అందజేయనున్నారు. అందులో సకినాలు, నువ్వుల లడ్డూ, గారెలు, ఇప్పపువ్వు లడ్డూ, మక్క పేలాలు ఉన్నాయి. ఇక లంచ్‌లో హైదరాబాద్ దమ్ బిర్యానీ, పాయా, మటన్ కర్రీ, విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాల వంటలను రెడీ చేస్తున్నారు.
News December 8, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు

RBI <<18475069>>రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25% తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును PNB 8.35 నుంచి 8.10%కి, BOB 8.15 నుంచి 7.90%కి, BOI 8.35 నుంచి 8.10%కి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10%, కార్ లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభమవుతాయని BOM తెలిపింది.
News December 8, 2025
ముడతలు తగ్గించే ఫేస్ ప్యాక్

యవ్వనంగా కనిపించే చర్మం కోసం రసాయన ఉత్పత్తులకు బదులు ఇంట్లోని సహజ పదార్థాలను వాడితే చాలు. వాటిల్లో ఒకటే ఈ అరటిపండు ఫేస్ ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును తీసుకొని కాస్త తేనె, బార్లీ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. బార్లీకి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.


