News July 20, 2024

TODAY HEADLINES

image

➣TG: గ్రూప్-2 పరీక్ష వాయిదా
➣ఏపీలో దాడులపై ఢిల్లీలో ధర్నా చేస్తాం: YS జగన్
➣AP: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: జగన్
➣TG: అంగన్వాడీల్లో అదనపు టీచర్: సీఎం రేవంత్
➣TG:BRS పాలన సాగుకు స్వర్ణయుగం: హరీశ్ రావు
➣TG: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ: ఉత్తమ్
➣AP: వినుకొండ హత్యకు కారకుడు జగనే: మంత్రి డోలా
➣ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలి: షర్మిల
➣T20 మహిళల ఆసియా కప్: పాక్‌పై భారత్ విక్టరీ

Similar News

News December 9, 2025

పీకల్లోతు కష్టాల్లో భారత్

image

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్‌లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.

News December 9, 2025

తెలంగాణకు పెట్టుబడుల ‘పవర్’

image

TG: గ్లోబల్ సమ్మిట్‌లో పవర్(విద్యుత్) సెక్టార్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.3,24,698 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 1,40,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జెన్‌కో, రెడ్కో, సింగరేణి సంస్థలు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నాయని వెల్లడించారు.

News December 9, 2025

శాంసన్‌కు మరోసారి అన్యాయం: ఫ్యాన్స్

image

SAతో తొలి T20లో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై ఆయన ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సంజూకి అన్యాయం జరిగిందని, ఫామ్‌‌లో లేని కొందరు ప్లేయర్లకు టీమ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ చేస్తోందని SMలో పోస్టులు పెడుతున్నారు. SAతో గత T20 సిరీస్‌లో శాంసన్ 2 సెంచరీలు చేశారని, గిల్ కంటే సంజూ బ్యాటింగ్ Avg, SR మెరుగ్గా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ప్లేయింగ్‌11లో ఉండేందుకు సంజూ అర్హుడని పేర్కొంటున్నారు.