News July 24, 2024

TODAY HEADLINES

image

* రూ.48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల
* మధ్యతరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్: మోదీ
* AP: బడ్జెట్ నిధులతో రాష్ట్రానికి ఎంతో ఊరట: చంద్రబాబు
* TG: బడ్జెట్‌లో తెలంగాణ పదం నిషేధించారు: రేవంత్
* తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
* మహిళల ఆసియాకప్‌లో సెమీస్ దూసుకెళ్లిన భారత్
* ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడి 229 మంది మృతి

Similar News

News January 16, 2026

173 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

NCERTలో 173 పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పెంచారు. అర్హతగల వారు జనవరి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in

News January 16, 2026

282 పోస్టులు.. అప్లై చేశారా?

image

CSI ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్‌ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జిల్లా కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 4, తెలంగాణలో 11 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in

News January 16, 2026

కనుమ – ముక్కనుమ: తేడాలేంటి?

image

నేడు కనుమ. రేపు ముక్కనుమ. ఈ పండుగలు పల్లె సంస్కృతికి అద్దం పడతాయి. కనుమ నాడు వ్యవసాయానికి చేదోడుగా నిలిచే పశువులను పూజించి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక ముక్కనుమ పండుగ ముగింపు సంబరం. ఈరోజున పశువులను చెరువులలో శుభ్రంగా కడిగి విశ్రాంతినిస్తారు. కనుమ రోజున శాకాహారానికి ప్రాధాన్యత ఉంటే, ముక్కనుమ నాడు మాంసాహార విందులు, గ్రామ దేవతల ఆరాధన, బొమ్మల నోము వంటి కార్యక్రమాలతో పండుగకు ఘనంగా ముగింపు పలుకుతారు.