News July 29, 2024
TODAY HEADLINES

➣ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం
➣మనూ భాకర్కు పీఎం మోదీ ప్రశంసలు
➣TG: రూ.2 లక్షల రుణమాఫీపై CM ప్రకటన
➣AP: వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ ఇంట్లో పోలీసుల సోదాలు
➣ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తివేత
➣TFC నూతన ఛైర్మన్గా భరత్ భూషణ్
➣ ఆసియా కప్ విజేతగా శ్రీలంక మహిళల జట్టు
Similar News
News November 13, 2025
తెలంగాణ ముచ్చట్లు

* ఉన్నతాధికారులు పర్మిషన్ లేకుండా స్కూల్ నుంచి విద్యార్థులను బయటకు తీసుకెళ్లొద్దని హెడ్మాస్టర్లకు ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు
* ఫిరాయింపు MLAలను రేపు, ఎల్లుండి అసెంబ్లీలోని కార్యాలయంలో విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
* ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 34,023 మందికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగు దొడ్లు మంజూరు
* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో టాప్-3లో జనగాం, ఖమ్మం, యాదాద్రి.. నిర్మాణ పనుల్లో 70% పురోగతి
News November 13, 2025
పదునెట్టాంబడి అంటే ఏంటి?

పదునెట్టాంబడి అంటే అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే 18 మెట్లు. ఈ మెట్లు మనిషి పరిపూర్ణత సాధించిన జ్ఞానానికి సంకేతాలు. జ్ఞాన సాధన చేసే అయ్యప్ప స్వాములు మాత్రమే వీటిని ఎక్కుతారు. వారికి ప్రత్యేకంగా పడిపూజ చేస్తారు. ఈ మెట్లు ఎక్కడం అనేది జ్ఞాన మార్గంలో సాగే ఆధ్యాత్మిక ప్రయాణానికి గుర్తుగా భావిస్తారు. ప్రతి మెట్టూ అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తుంది. పరిశుద్ధమైన మనసుతోనే ఈ మెట్లెక్కాలి. <<-se>>#AyyappaMala<<>>
News November 13, 2025
ఆసిమ్ మునీర్కు విస్తృత అధికారాలు!

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ విస్తృత అధికారాలు పొందేందుకు రాజ్యాంగ సవరణకు ఆమోదముద్ర పడింది. ఇది అన్ని సైనిక శాఖలపై అతనికి అత్యున్నత అధికారాన్ని కల్పించడమే కాకుండా సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేస్తుంది. కొత్త అధికారాలతో నియామకాలు, మధ్యంతర ప్రభుత్వాలపై నియంత్రణ కలిగి ఉండటమే కాకుండా చట్టపరమైన విచారణ నుంచి జీవితకాల రక్షణ పొందుతారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు, పలువురు జడ్జిలు ఖండించారు.


