News July 31, 2024
TODAY HEADLINES

* కేరళలో కొండచరియలు విరిగిపడి 120 మందికి పైగా మృతి
* ఒలింపిక్స్: షూటింగ్లో మనూ భాకర్‌కు మరో కాంస్య పతకం
* ఆగస్టు నెల పెన్షన్ నిధులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
* ఎస్సీల కోసం కొత్త పథకాలు రూపొందించాలి: సీఎం CBN
* TG: రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల
* TG: ఎల్లుండి కొత్త రేషన్ కార్డుల విధివిధానాలు ఖరారు: మంత్రి ఉత్తమ్
* TG: విద్యుత్ కమిషన్ నూతన ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ బి లోకుర్
Similar News
News October 18, 2025
ఘోర ప్రమాదం… 8 మంది భక్తుల మృతి

మహారాష్ట్రలోని చాంద్‌షాలి ఘాట్ వద్ద పికప్ వ్యాను లోయలో పడి 8మంది భక్తులు మరణించారు. ఇష్టదైవం అస్తంబా దేవీయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల వ్యాను ఘాట్ రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. వ్యాను తునాతునకలు కాగా భక్తులు వాహనం కింద పడిపోయారు. 8మంది అక్కడికక్కడే మరణించగా మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యంత వేగంతో వెళ్తూ డ్రైవర్ పట్టుకోల్పోవడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు.
News October 18, 2025
జిప్మర్లో 118 పోస్టులు

పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER)118 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, PG, MD, MS, DNB, DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
News October 18, 2025
కోడిపిల్లల పెంపకం.. ముఖ్యమైన సూచనలు

షెడ్లోకి కోడి పిల్లలను వదిలిన తర్వాత ప్రతిరోజూ 2 లేదా 3 సార్లు వాటి ప్రవర్తన, ఆరోగ్యస్థితిని పరిశీలించాలి. చిన్న పిల్లలను పెంచే షెడ్డుకు, పెద్ద కోళ్లను ఉంచే షెడ్‌కు మధ్య కనీసం 100 గజాల దూరం ఉండేలా చూసుకోవాలి. కోడి పిల్లలను ఉంచే షెడ్లో లిట్టరు పొడిగా ఉండేట్లు జాగ్రత్తపడాలి. కోడి పిల్లలను పెంచే షెడ్ వైపునకు నాటు కోళ్లను రానీయకూడదు. చలి గాలులు సోకకుండా షెడ్డుకు ఇరువైపులా పరదాలను వేలాడదీయాలి.