News August 1, 2024
TODAY HEADLINES

➢TG: మోసానికి ప్రతిరూపం సబిత: రేవంత్
➢TG:కన్నీరు పెట్టుకున్న BRS ఎమ్మెల్యే సబిత
➢TG:సీఎం రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి BRS పిలుపు
➢ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగింపు
➢AP:వచ్చే 100 రోజుల్లో కొత్త పాలసీలు తీసుకురావాలి: CM చంద్రబాబు
➢AP:బియ్యం, కందిపప్పు ధరలు తగ్గింపు: మంత్రి నాదెండ్ల
➢ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు: పవన్ కళ్యాణ్
➢ప్రజారోగ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పార్థసారథి
Similar News
News March 13, 2026
కోమాలో మొజ్తబా ఖమేనీ: UK మీడియా

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారని UK మీడియా చెబుతోంది. ఆయన ఒక కాలు కోల్పోయారని, పొట్ట/లివర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని అంటోంది. అయితే <<19348883>>అలీ ఖమేనీ<<>> చనిపోయిన రోజే గాయపడ్డారా, లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ వార్తలు వచ్చిన కాసేపటికే <<19365703>>మొజ్తబా హెచ్చరించారంటూ<<>> ఇరాన్ ప్రభుత్వ TV ప్రకటన చేసింది. దీంతో ‘కోమాలో ఉన్నప్పటికీ USకు మొజ్తబా వార్నింగ్ ఇచ్చారు’ అని బ్రిటన్ మీడియా సెటైర్స్ వేసింది.
News March 12, 2026
ఫోన్ పే, గూగుల్ పేలో కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారా?

ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిలో కరెంట్ బిల్లుల చెల్లింపు ఆప్షన్ పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో లాగా బిల్ జనరేట్ అవ్వడం లేదని, తాత్కాలికంగా బిల్లర్ డౌన్ అంటూ చూపుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? అయితే విద్యుత్ శాఖ అఫీషియల్ యాప్‌లో పవర్ బిల్ పే చేయొచ్చు.
News March 12, 2026
సిలిండర్లు నిల్వ ఉంచుకోవద్దు.. కేంద్రం సూచన

దేశంలో గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందొద్దని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ వెల్లడించింది. LPG ఉత్పత్తి పెంపు, సరఫరాలో ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది. 2.5 రోజుల్లోనే సిలిండర్లు డెలివరీ చేస్తున్నామని తెలిపింది. ప్రజలు ఆందోళన చెంది హడావుడిగా బుకింగ్స్ చేయడం లేదా సిలిండర్లు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.


