News March 28, 2024
TODAY HEADLINES
IPL చరిత్రలో అత్యధిక స్కోర్.. 277 రన్స్‌తో SRH రికార్డు
TG: మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
TG: కాంగ్రెస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు: కేటీఆర్
AP: నాపై బురద జల్లేందుకు చెల్లెల్ని తీసుకొచ్చారు: సీఎం జగన్
AP: నరకాసుర పాలనకు చెక్ పెట్టే సమయం వచ్చింది: బాబు
AP: 10 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా
★ డబ్బుల్లేకే ఎన్నికల్లో పోటీ చేయలేదు: నిర్మలా సీతారామన్
Similar News
News November 5, 2024
2024 US elections: పోలింగ్ ప్రారంభం
అమెరికా 47వ అధ్యక్ష ఎన్నికకు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 24 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే 7.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రెడ్, బ్లూ స్టేట్స్‌లో పెద్దగా హడావుడి లేకపోయినా స్వింగ్ స్టేట్స్‌లో ఉత్కంఠ నెలకొంది. డెమోక్రాట్ల నుంచి కమల, ఆమె రన్నింగ్ మేట్‌గా టీమ్ వాల్జ్, రిపబ్లికన్ల నుంచి ట్రంప్, ఆయన రన్నింగ్ మేట్‌గా జేడీ వాన్స్ బరిలో ఉన్నారు.
News November 5, 2024
రేపట్నుంచి ఒంటిపూట బడులు
TG: రాష్ట్రంలో రేపట్నుంచి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల టీచర్లను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉ.9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. అటు ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
News November 5, 2024
ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ఉన్న 33% రిజర్వేషన్లను 35 శాతానికి పెంచేందుకు మధ్యప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు CM మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో అన్ని రకాల ప్రభుత్వ నియామకాల్లో (ఫారెస్ట్ మినహా) మహిళలకు 35% రిజర్వేషన్లు అమలుకానున్నాయి. మహిళా సాధికారతలో ఈ నిర్ణయం కీలక ముందడుగని డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా పేర్కొన్నారు.