News August 5, 2024
TODAY HEADLINES

* ఒలింపిక్స్: సెమీస్కు భారత హాకీ జట్టు
* రెండో వన్డేలో భారత్పై శ్రీలంక విజయం
* బంగ్లాదేశ్లో మళ్లీ చెలరేగిన హింస.. 91 మంది మృతి
* ఫేక్ రాజకీయాల ట్రాప్లో పడొద్దు: CM CBN
* ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో దాడులు: YS జగన్
* కేరళకు చిరంజీవి, రామ్చరణ్ ₹కోటి, అల్లుఅర్జున్ ₹25లక్షలు విరాళం
* USలో సీఎం రేవంత్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన KTR
* రేపు తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు
Similar News
News January 18, 2026
పితృ దేవతల అనుగ్రహం కోసం ఇలా చేయండి!

పితృ దోషాలు, పూర్వీకుల అనుగ్రహం పొందేందుకు మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యమైందని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి నదీ స్నానం ఆచరించాలి. ఉపవాసం ఉంటూ, మౌనవ్రతం పాటించాలి. జాతకంలో పితృ దోషాలు ఉన్నవారు నల్ల నువ్వులతో తర్పణం వదలాలి. పేదలకు అన్నదానం, వస్త్ర దానం, పెరుగు దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. పండితుడికి బూడిద గుమ్మడికాయ దానం చేయడం మంచిది’ అని సూచిస్తున్నారు.
News January 18, 2026
డెయిరీఫామ్ కోసం పశువులను కొంటున్నారా?

డెయిరీఫామ్ నిర్వహణలో భాగంగా ఆవులు, గేదెలను కొనుగోలు చేసి పాడి రైతులు, పెంపకందారులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్తుంటారు. ఇలా తరలించేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. లేకుంటే వాటి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని పత్రాలను కూడా కొనుగోలుదారులు కలిగి ఉండాలి. ఆ పత్రాల వివరాలు, జీవాల తరలింపులో జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 18, 2026
అంగన్వాడీల్లో అల్పాహారం.. వచ్చే నెలలో ప్రారంభం

TG: అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీజీ ఫుడ్స్ ద్వారా కిచిడీ, ఉప్మా వంటి టిఫిన్స్ను పిల్లలకు అందించనుంది. తొలుత హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల పరిధిలో ఉన్న 970 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లోటుపాట్లను సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా 35,781 కేంద్రాల్లో అమలు చేయనున్నట్లు సమాచారం.


