News August 16, 2024
TODAY HEADLINES

* దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
* సెక్యులర్ సివిల్ కోడ్ అత్యవసరం: PM మోదీ
* అన్న క్యాంటీన్లు ప్రారంభించిన CM చంద్రబాబు
* రోజా, కృష్ణదాస్‌పై CIDకి ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
* హరీశ్‌రావు రాజీనామా చేయాలి: CM రేవంత్
* రేవంత్ లాంటి దిగజారిన సీఎంను చూడలేదు: హరీశ్
* రేపు ఖాతాల్లోకి రూ.2 లక్షల వరకు రుణమాఫీ డబ్బులు: భట్టి
* HYDలో దంచికొట్టిన వర్షం
Similar News
News January 9, 2026
బ్లోఅవుట్ వద్ద సీఎం ఏరియల్ వ్యూ

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. సిబ్బంది చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం ఆరా తీశారు. ఇటీవల గ్యాస్ బ్లోఅవుట్ జరిగి మంటలు చెలరేగగా ఇంకా అదుపులోకి రాలేదు. పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News January 9, 2026
రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థులకు గుడ్‌న్యూస్. పాఠశాలలకు నేడే చివరి వర్కింగ్ డే. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు మొదలవ్వనున్నాయి. ఏపీలో ఈ నెల 18 వరకు కొనసాగుతాయి. 19న(సోమవారం) పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తెలంగాణలో 17న(శనివారం) స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయి. పిల్లలకు హాలిడేస్ నేపథ్యంలో పేరెంట్స్ స్వగ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారనున్నాయి.
News January 9, 2026
UP: 30ఏళ్లు పాక్ మహిళ ప్రభుత్వ ఉద్యోగం.. చివరికి

పాకిస్థానీ నేషనాలిటీని దాచేసి UPలో 30 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసిన మహిళ బండారం బయటపడింది. దీంతో ఆమెను అధికారులు సస్పెండ్ చేయగా, పోలీసులు FIR నమోదు చేశారు. మహీరా అక్తర్(ఫర్జానా) 1979లో పాకిస్థానీని పెళ్లాడి అక్కడి పౌరసత్వాన్నీ పొందింది. విడాకుల తర్వాత IND వచ్చి 1985లో ఓ లోకల్ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఫేక్ సర్టిఫికెట్లతో టీచర్ జాబ్ సాధించింది. తాజాగా విద్యాశాఖ దర్యాప్తులో ఆమె ముసుగు తొలిగింది.


