News August 18, 2024

TODAY HEADLINES

image

* PM మోదీతో చంద్రబాబు భేటీ.. అమరావతి, పోలవరంపై చర్చ
* ఉద్యోగుల బదిలీలకు AP ప్రభుత్వం ఆమోదం
* YCPకి ఆళ్ల నాని రాజీనామా
* స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు TG ప్రభుత్వం నిర్ణయం
* సీఎం రేవంత్ BJPలో చేరుతారు: KTR
* రుణమాఫీపై BRS, కాంగ్రెస్ మధ్య సవాళ్లు
* కర్ణాటకలో ముడా స్కామ్: సీఎంపై విచారణకు గవర్నర్ ఆదేశం
* గవర్నర్ నిర్ణయం చట్ట విరుద్ధం: సిద్దరామయ్య
* బంగ్లా అల్లర్లలో 650 మంది మృతి: ఐరాస

Similar News

News January 12, 2026

లాభాల్లోకి స్టాక్ మార్కెట్స్

image

నష్టాలతో మొదలైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు కోల్పోయింది. అలాంటి పరిస్థితి నుంచి సెన్సెక్స్ 60కి పైగా పాయింట్లు లాభపడి 83,640 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 40కి పైగా పాయింట్లు ఎగబాకి 25,725 వద్ద కొనసాగుతోంది.

News January 12, 2026

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌(HCL)లో 7 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్(మైనింగ్), బీఈ, పీజీ(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), పీజీ, పీహెచ్‌డీ(జియాలజీ), ఎంఏ( హిందీ, ఇంగ్లిష్), MBBS, MD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ మెయిల్ careershindcopper@gmail.comకు దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్స్ పంపాలి. వెబ్‌సైట్: hindustancopper.com/

News January 12, 2026

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు నోటీసులు 1/2

image

TG: రాష్ట్రంలో 2వేల ఏజెన్సీల పరిధిలో 4L మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి ఆధార్, వేతన వివరాలను EX CS శాంతికుమారి కమిటీ సేకరించింది. అయితే ఏజెన్సీలు EPF, ESIలకు నిధులు జమచేయడం లేదని గుర్తించింది. ఆ అకౌంట్ల వివరాలివ్వాలని, లేకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని తాజాగా నోటీసులిచ్చింది. ఇవి అందితే వాటి అవినీతి బాగోతం బయటపడనుంది. దీంతో ఏజెన్సీలు అకౌంట్లు తెరిచే పనిలో పడ్డాయి.