News August 21, 2024
TODAY HEADLINES

➢AP: తక్కువ ధరకే విద్యుత్ అందించేలా చర్యలు: CM CBN
➢ఏపీలో CBI విచారణకు ప్రభుత్వం అనుమతి
➢TG: సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం: CM రేవంత్
➢22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు
➢రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయాలి: హరీశ్ రావు
➢TG: రూ.7,500కోట్లే మాఫీ జరిగినట్లుంది: భట్టి
➢AP:నన్ను చంపాలని చూస్తున్నారు: కేతిరెడ్డి
➢AP:ఈ నెల 23 నుంచి గ్రామ సభలు
Similar News
News November 19, 2025
న్యూస్ రౌండప్

✦ TGలో నేటి నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. మ.12 గంటలకు HYD నెక్లెస్ రోడ్డులో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద చీరల పంపిణీని ప్రారంభించనున్న CM రేవంత్
✦ పార్టీ ఫిరాయింపులపై నేడు, రేపు MLAల విచారణ.. నేడు తెల్లం వెంకట్రావు, సంజయ్, రేపు పోచారం, అరికెపూడి గాంధీకి సంబంధించిన పిటిషన్ల విచారణ
✦ రేపు బిహార్కు CM CBN, మంత్రి లోకేశ్.. నితీశ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడంతో పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ
News November 19, 2025
మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.
News November 19, 2025
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

సినీ నటి తులసి యాక్టింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి 4వ ఏట నుంచి నటనా ప్రస్థానాన్ని మొదలెట్టారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. ‘శంకరాభరణం’లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. యువ హీరోలకు తల్లి పాత్రల్లోనూ కనిపించి మెప్పించారు.


