News February 24, 2025
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 24)

* 1911- తెలుగు రచయిత పిలకా గణపతిశాస్త్రి జననం
* 1948- తమిళనాడు మాజీ సీఎం జయలలిత జననం
* 1951- సాహితీవేత్త, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి మరణం
* 1980- ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణం
* 2018- అతిలోక సుందరి శ్రీదేవి మరణం(ఫొటోలో)
* 1984- నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు(ఫొటోలో)
Similar News
News October 29, 2025
అజహరుద్దీన్‌కు హోంశాఖ!?

TG: కాంగ్రెస్ సీనియర్ నేత <<18140326>>అజహరుద్దీన్‌కు<<>> హోం, మైనారిటీ సంక్షేమ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. అటు అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక మరో రెండు మంత్రి పదవులను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందని సమాచారం.
News October 29, 2025
NI-MSMEలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్ 3 అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 29, 2025
తుఫాన్ నష్టంపై వేగంగా అంచనాలు: లోకేశ్

AP: ‘మొంథా’ ప్రభావంతో జరిగిన నష్టంపై వేగంగా ప్రాథమిక అంచనాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, చెట్లు కూలి కరెంటు నిలిచిపోయిందని చెప్పారు. విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయాన్ని అందించాలని సూచించారు.


