News February 26, 2025

చరిత్రలో ఈరోజు.. ఫిబ్రవరి 26

image

* 1802- ఫ్రెంచి నవలా రచయిత విక్టర్ హ్యూగో జననం
* 1829- బ్లూ జీన్స్‌ని తొలిసారి రూపొందించిన లెవీ స్ట్రాస్ అండ్ కో ఫౌండర్ లెవీ స్ట్రాస్ జననం
* 1932- సామాజిక కార్యకర్త హేమలతా లవణం జననం
* 1982- మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు పుట్టినరోజు
* 1962- ఉమ్మడి ఏపీ శాసనసభ మొదటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు మరణం
* 1966- అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్ మరణం(ఫొటోలో)

Similar News

News February 26, 2025

కార్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఫార్ములా మర్చిపోవద్దు!

image

బ్యాంకు లోన్ తీసుకొని కారు కొంటున్నవారు 20/4/10 ఫార్ములాను తప్పక పాటించాలి. ఈ రూల్ ప్రకారం కార్ ఆన్ రోడ్ ప్రైజ్‌లో 20% డౌన్‌పేమెంట్ చెల్లించాలి. లోన్ గరిష్ఠ టెన్యూర్ 4ఏళ్లకు మించకూడదు. EMI మీ నెలవారీ సంపాదనలో 10శాతానికి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. బ్యాంకులు 8.70% నుంచి 10% వడ్డీతో కార్ లోన్లు ఇస్తున్నాయి. సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీ శాతం అంచనా వేస్తారు.

News February 26, 2025

ఆత్మహత్యల ‘కోటా’.. అడ్డుకట్టకు చర్యలు!

image

రాజస్థాన్‌లోని కోటాలో ఎన్ని చర్యలు చేపట్టినా విద్యార్థుల ఆత్మహత్యలకు <<14028051>>అడ్డుకట్ట<<>> పడటంలేదు. స్థానిక అధికారులు తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో హాస్టల్ యజమానులు ఏడాది మొత్తం ఫీజును ఒకేసారి వసూలు చేసేవారు. ఇకపై తొలుత రూ.2వేలు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పార్క్‌లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు.

News February 26, 2025

నేనైనా లింగ వివక్షను ఎదుర్కోవాల్సిందే: జ్యోతిక

image

హీరో సూర్య భార్యగా తానూ లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు నటి జ్యోతిక చెప్పారు. ‘సూర్యని పెళ్లి చేసుకున్నందుకు నేను అదృష్టవంతురాలినని ఏదైనా ఇంటర్వ్యూలో చెబితే ప్రజలు అతడు మంచివాడని అంటారు. నన్ను పెళ్లి చేసుకొని సూర్య సంతోషంగా ఉన్నాడని చెప్పినా అతడినే పొగుడుతారు. ఇందులో నేనెక్కడా కనిపించను. ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుంది’ అని తాను నటించిన ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో తెలిపారు.

error: Content is protected !!