News May 17, 2024
ఈరోజు ఐపీఎల్‌లో: ప్రతిష్ఠ కోసం పోరు
ఐపీఎల్‌లో ఈరోజు ముంబై, లక్నో వాంఖడేలో తలపడనున్నాయి. రెండు జట్లు ప్రతిష్ఠ కోసం ఆడనున్నాయి. ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప LSG కథ కూడా ముగిసినట్లే. ఉదాహరణకు.. తాము 200 స్కోర్ చేసి ముంబైని 100లోపు ఆలౌట్ చేసినా లక్నో రన్ రేట్ -0.351కు మాత్రమే చేరుతుంది. ఆర్సీబీ, సీఎస్కే రెండూ భారీ రన్‌రేట్‌తో ఉన్న నేపథ్యంలో లక్నోకు ప్లే ఆఫ్స్ దాదాపు అసాధ్యం.
Similar News
News January 11, 2025
విద్యార్థులకు శుభవార్త: లోకేశ్
AP: సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు CM చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘కంసమామ మోసం చేసి పోతే చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేస్తున్నారు. గత పాలకుల పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను మంత్రి అయ్యాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. రూ.788 కోట్లు చెల్లిస్తున్నాం’ అని లోకేశ్ Xలో ట్వీట్ చేశారు.
News January 11, 2025
భారత్-ఇంగ్లండ్ T20 సిరీస్ షెడ్యూల్
☛ జనవరి 22- తొలి T20- కోల్‌కతా
☛ జనవరి 25- రెండో T20- చెన్నై
☛ జనవరి 28- మూడో T20- రాజ్‌కోట్
☛ జనవరి 31- 4వ T20- పుణే
☛ ఫిబ్రవరి 2- ఐదో T20- ముంబై
☛ ☛ అన్ని <<15128809>>మ్యాచ్‌లు <<>>రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.
News January 11, 2025
యశస్వీ జైస్వాల్‌కు మరోసారి నిరాశే
టీమ్ ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్‌కు మరోసారి బీసీసీఐ మొండిచేయి చూపింది. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. బీజీటీలో రాణించిన జైస్వాల్‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జైస్వాల్ అద్భుత ఫామ్‌ను బీసీసీఐ వృథా చేస్తోందని మండిపడుతున్నారు. గత ఐపీఎల్‌లో కూడా ఆయన రాణించారని, సెలక్ట్ చేయాల్సిందని కామెంట్లు చేస్తున్నారు.