News August 1, 2024
నేడు ఒలింపిక్స్‌లో..
పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ షూటింగ్ ఫైనల్‌లో స్వప్నిల్, అథ్లెటిక్స్‌లో 20KM నడకలో పరమ్‌జీత్, అక్ష్‌దీప్, వికాస్, ప్రియాంక పతకం కోసం పోటీ పడనున్నారు. మరోవైపు బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, ప్రణయ్, సింధు, బాక్సింగ్‌లో నిఖత్ ప్రీ క్వార్టర్స్ బరిలో ఉన్నారు. భారత్, బెల్జియం మధ్య హకీ గ్రూప్ మ్యాచ్ జరగనుంది. ఆర్చరీలో ప్రవీణ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News February 2, 2025
90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే: సచిన్
విలువలు పాటించే విషయంలో తనకు తన కుటుంబం ఎంతో మద్దతునిచ్చిందని సచిన్ టెండూల్కర్ చెప్పారు. నమన్ అవార్డ్స్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ’90వ దశకం మధ్యలో రెండేళ్లు నేను బ్యాట్ కాంట్రాక్టు లేకుండా ఆడాను. ఆ సమయంలో ఆల్కహాల్, టొబాకో కంపెనీలు తమ ప్రచారం కోసం బ్యాట్‌లను మాధ్యమంగా వాడుకున్నాయి. అందుకే వాటిని ప్రోత్సహించొద్దని మా ఇంట్లో డిసైడ్ అయ్యాం. 90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే’ అని వెల్లడించారు.
News February 2, 2025
GBS కలకలం.. పెరుగుతున్న మరణాలు
మహారాష్ట్రలో గిలియన్ బార్ సిండ్రోమ్‌తో మరో మరణం సంభవించింది. నాందేడ్‌లో 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆ రాష్ట్రంలో GBS మరణాల సంఖ్య 5కు పెరిగింది. మరోవైపు పుణేలో కేసుల సంఖ్య 149కి చేరింది. తాజాగా అస్సాంలో తొలి GBS మరణం నమోదైంది. ఇటీవల తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన <<15316737>>ఓ మహిళ<<>> ఈ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.
News February 2, 2025
ఆక్రమణలను నివారించేందుకు కృషి చేస్తున్నాం: పవన్
AP: పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది మాత్రమే కాదని, ప్రజలందరిదని Dy.CM పవన్ అన్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు. ‘ప్రకృతిలో విలువైన పర్యావరణ వ్యవస్థల్లో చిత్తడి నేలలు ప్రధానమైనవి. APలో 25,000 ఎకరాలకుపైగా ఉన్నాయి. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆక్రమణలను నివారించేందుకు, భౌగోళిక పరిమితులను కచ్చితంగా నిర్ధారించేందుకు కృషి చేస్తోంది’ అని పేర్కొన్నారు.