News September 9, 2025
తెలుగు జాతికి నేడు చీకటి రోజు: షర్మిల

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి TDP, జనసేన, YCP మద్దతుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘తెలుగు జాతికి నేడు చీకటి రోజు. తెలుగు బిడ్డ(సుదర్శన్ రెడ్డి) పోటీ పడితే, RSS వాదికి ఓటు వేయించిన 3 పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు. మత పిచ్చి మోదీకి మోకాళ్లు ఒత్తడమే వారి లక్ష్యం. BJPకి ఓటు వేసినందుకు YCP సిగ్గుపడాలి. కేసులకు భయపడి మోదీకి జగన్ దత్తపుత్రుడిగా అవతారం ఎత్తారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 26, 2026
మార్కాపురం ప్రమాదం.. మొండి కత్తితో 8 మందిని కాపాడాడు

AP: మార్కాపురం <<19479058>>బస్సు ప్రమాద ఘటన<<>>లో ఓ వ్యక్తి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడారు. బస్సులో మంటలు చెలరేగగానే అక్కడే ఉన్న మొండికత్తితో అద్దాలు పగలగొట్టి ఎనిమిది మందిని బయటకు తోసేశారు. తర్వాత తాను కూడా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పొగ దట్టంగా వ్యాపించడంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయానని ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.
News March 26, 2026
బ్రెయిన్‌లో ఆలోచనలు.. నిద్ర పట్టక పాట్లు!

ప్రస్తుతం చాలామంది ‘నిద్రలేమి’ సమస్యతో బాధపడుతున్నారు. రోజంతా బిజీగా ఉండటంతో రాత్రి మైండ్ రెస్ట్‌లోకి వెళ్లకపోవడంతో నిద్ర పట్టదు. దీన్నే ‘కాగ్నిటివ్ హైపర్- అలర్ట్‌నెస్’ అంటారు. కొన్ని జీవనశైలి మార్పులతో దీనిని అధిగమించవచ్చు. *నిద్రకు ముందు TV చూడొద్దు. *రోజూ ఒకే సమయానికి పడుకోండి. *గదిలో వెలుతురు ఉండొద్దు. *రాత్రి కాఫీ, టీ తాగకండి. *వ్యాయామం, వాకింగ్, మెడిటేషన్ చేస్తే హాయిగా నిద్రపడుతుంది.