News July 27, 2024
టెన్నిస్ ఫ్యాన్స్‌కు ఈరోజు ‘డబుల్’ ధమాకా

పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు టెన్నిస్ షెడ్యూల్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. మెన్స్ డబుల్స్ విభాగంలో భారత్ తరఫున ఎన్ బాలాజీ, రోహన్ బొప్పన్న జోడీ రోజర్-రెబౌల్ (ఫ్రాన్స్) ద్వయంతో తలపడనుంది. మరోవైపు స్పెయిన్ – అర్జెంటీనా మ్యాచ్ కోసమూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్, యువ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ కలిసి ఆడనుండటంతో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. <<-se>>#Olympics2024<<>>
Similar News
News November 28, 2025
NZB: పోలీసు సిబ్బందికి ఉలన్ బ్లాంకెట్స్, టీ షర్ట్స్ అందజేత

చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతోందని ముందు జాగ్రత్తగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్‌లోని ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి ఉలెన్ బ్లాంకెట్స్, టీ షర్ట్స్ అందజేశారు. చలికాలంలో ప్రతి ఒక్కరూ ఉలెన్ బ్లాంకెట్స్ సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణలో క్యారీ చేసి ఉపయోగించుకోవాలని సీపీ సూచించారు.
News November 28, 2025
గంభీర్‌పై తివారీ ఘాటు వ్యాఖ్యలు

SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లో 0-2తో ఓటమి తరువాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. ఆయనను వెంటనే తొలగించాలంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. గంభీర్ తప్పుడు వ్యూహాలు, జట్టులో అతి మార్పులే ఈ పరాజయానికి కారణమని ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు రోహిత్ శర్మ, ద్రవిడ్, కోహ్లీ నిర్మించిన జట్టే కారణమని, గంభీర్ ప్రభావం లేదని తివారీ పేర్కొన్నారు.
News November 28, 2025
బాపట్ల DWCWEOలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్ (DWCWEO)లో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/


