News July 30, 2024

ఇవాళ రైతుల ఇళ్లలో పండగరోజు: రేవంత్

image

TG: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు ప్రయోజనాలే తమ ప్రభుత్వ విధానమని రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో చెప్పారు. రూ.లక్షన్నర వరకు రైతు రుణాలను మాఫీ చేశామని, ఇవాళ రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లలో పండగ రోజని అన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News January 29, 2026

బార్ లైసెన్సులకు నోటిఫికేషన్

image

AP: బార్ లైసెన్సులకు ప్రభుత్వం రీనోటిఫికేషన్ జారీ చేసింది. 2025-28 బార్ పాలసీ కింద మిగిలిన 301 బార్ లైసెన్సులకు రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ కేటగిరీ కింద నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీ 6 గంటల వరకు దరఖాస్తులను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో స్వీకరించనుంది. లక్కీ డిప్ పద్ధతిలో 5వ తేదీన లైసెన్సులు కేటాయించనుంది.

News January 29, 2026

బిహార్‌లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

image

మహిళా ఉపాధి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని బిహార్ ప్రభుత్వం భారీగా పెంచింది. తమ హామీ మేరకు ₹2 లక్షలకు పెంచుతున్నట్లు CM నితీశ్ కుమార్ ట్వీట్ చేశారు. 1.56 కోట్ల మందికి తొలి విడతలో ₹10 వేలు ఇచ్చామని పేర్కొన్నారు. వీరంతా 6 నెలల తర్వాత అదనపు సాయం పొందడానికి అర్హులవుతారని తెలిపారు. గతంలో ఇచ్చిన ₹10 వేలను ఉపాధి కోసం ఎంత సమర్థంగా ఉపయోగించారనే దాని ఆధారంగా దశలవారీగా మిగతా మొత్తం ఇస్తామని చెప్పారు.

News January 29, 2026

తిరుమల లడ్డూ.. YCP vs టీడీపీ, జనసేన

image

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని సిట్ పేర్కొందని, చంద్రబాబు, పవన్ తప్పుడు ఆరోపణలు చేశారని వైసీపీ వరుస పోస్టులు చేస్తోంది. వారు క్షమాపణలు చెప్పాలని #ApologizeToDevotees అనే హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోంది. అటు లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని, కెమికల్స్‌తో చేసినట్లు సిట్ పేర్కొందని టీడీపీ, జనసేన శ్రేణులు #NoGheeInTTDLaddu అంటూ కౌంటర్ ఇస్తున్నాయి.