News January 13, 2025

ఇవాళ హైడ్రా ప్రజావాణికి సెలవు

image

TG: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సంక్రాంతి సెలవుల కారణంగా ఇవాళ ఉండదని హైడ్రా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ సెలవులలో ప్రజావాణి నిర్వహించట్లేదని గతంలోనే ప్రకటించినట్లు తెలిపింది. వచ్చే సోమవారం(20.01.2025) తిరిగి నిర్వహిస్తామని పేర్కొంది.

Similar News

News September 16, 2025

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం

image

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మన దేశంపై ట్రంప్ 50శాతం టారిఫ్‌లు విధించిన తర్వాత తొలిసారి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య ఐదు విడతల్లో సమావేశాలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ ఇప్పటికే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

News September 16, 2025

శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం: భూమన

image

AP: శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం జరిగిందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి వాపోయారు. ‘అలిపిరిలో మలమూత్రాలు విసర్జించే చోట, మద్యం బాటిల్స్ మధ్య శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హైందవ ధర్మానికి తూట్లు పొడిచేలా టీటీడీ తీరు ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయి. హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.

News September 16, 2025

పిల్లలకు పాలు ఎలా పట్టించాలి?

image

బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలి. అయితే జాగ్రత్తగా పాలు పట్టించకపోతే గొంతులోకి బదులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బిడ్డకు ప్రాణాంతకమవుతుంది. పాలిచ్చేటప్పుడు శరీరం కంటే బిడ్డ తల పైకి ఉండాలి. చేతులతో బిడ్డ భుజాలు, తల, వీపు భాగానికి ఆసరా ఇవ్వాలి. పాలివ్వడానికి తల్లి ముందుకు ఒంగకూడదు. కుర్చీలో వెనక్కి ఆనుకొని పట్టించాలి. పాలు పట్టాక జీర్ణం అయ్యేందుకు కొద్దిసేపు బిడ్డ వీపు నెమ్మదిగా నిమరాలి.